Friday, January 24, 2025

సంగారెడ్డిలో సెల్​ఫోన్ దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిః సెల్ ఫోన్ దుకాణం షట్టర్ పగలగొట్టి 31సెల్‌ఫోన్‌లను దొంగిలించిన ఐదుగురిని సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్‌పి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ… సుభన్, ముర్షీద్,ముషారఫ్, రషీద్, ఫర్హాన్‌లు జనవరి 23న సంగారెడ్డి పట్టణంలో దొంగతనం చేయాలని పట్టణంలోపలు ప్రాంతాల్లో సంచరించారని, రాత్రి కొత్త బస్టాండ్ ముందు ఉన్న వీరభధ్ర మొబైల్ షాపు వద్దకు వెళ్లగా వీలుకాకపోవడంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న రజాక్ సన్స్ క్యాష్ కౌంటర్ నుండి 2వేల నగదును తీసుకొని 15సబ్చులను కొనుగోలు చేసి మిగతా డబ్బులను సమానంగా పంచుకున్నారన్నారు.

తర్వాత రోజు అర్దరాత్రి 12గంటల సమయంలో ఐదుగురు కలిసి షట్టర్ లేపేందుకు ప్రయత్నించగా షాపు తలుపు కొద్దిగా తెరుచుకోవడంతో రషీద్ షాపులోకి వెళ్లి 31మొబైల్ ఫోన్‌లను బ్యాగులో వేసుకొని తెచ్చాడన్నారు. అందరూ ఆటోలో హత్నూర మండలం ముచ్చెర్ల గ్రామానికి వెళ్లి రషీద్ దొంగిలించినందుకు ఒక సెల్ ఫోన్‌ను అదనంగా ఇచ్చారన్నారు. ఈ నెల3వ తేదీన మరో దొంగతనం చేసేందుకు కొండాపూర్ మండలం మల్లెపల్లిలో కలిశారన్నారు. శనివారం సంగారెడ్డి కరుణ స్కూల్ వద్ద ఎదైనా షాపులో దొంగతనం చేయాలని చూస్తున్న వారిని అనుమానించి పెట్రోలింగ్ పోలీసులు పట్టుకొని సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారని, విచారించగా మొబైల్ షాపులో దొంగతనం చేసింది ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించమాని డిఎస్‌పి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ శ్రీధర్‌రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News