Tuesday, November 5, 2024

సర్జరీ మధ్యలో డ్రోన్ ద్వారా కణ నమూనా రవాణా

- Advertisement -
- Advertisement -

37 కిమీ దూరం కేవలం 16 నిమిషాల్లోనే

న్యూఢిల్లీ : రోగికి సర్జరీ చేస్తూ మధ్యలో అతని కణ నమూనాను పరీక్ష కోసం డ్రోన్ ద్వారా రవాణా చేసే ట్రయల్ రన్‌ను ఐసిఎంఆర్ విజయవంతంగా నిర్వహించింది. అదే 37 కిమీ దూరం రోడ్డు మార్గం ద్వారా పంపిస్తే దాదాపు గంట సమయం పట్టేది. కానీ డ్రోన్ ద్వారా కేవలం 1520 నిమిషాల్లోనే పరీక్ష కేంద్రానికి చేరడం గమనార్హం. కర్కాల సరిహద్దులోగల డాక్టర్ టిఎంఎ పాయ్ ఆస్పత్రి లోని రోగికి సర్జరీ చేస్తూ ఆయన నుంచి తొలగించిన క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కణాన్ని తొలగించి డ్రోన్ ద్వారా మణిపాల్ లోని కస్తూర్బా మెడికల్ కాలేజీకి ఆధునిక పరీక్ష కోసం పంపారు. ఈ 37 కిమీ దూరం డ్రోన్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోపే గమ్యం చేర్చడమైంది.

ఆ నమూనాకు ఆధునిక వైద్య పరీక్షలు జరిపి విశ్లేషించారు. ఆ నివేదికను ఎలెక్రానిక్ ప్రక్రియ ద్వారా తిరిగి కర్కాల ఆస్పత్రికి పంపగా దాని ఆధారంగా వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. డ్రోన్ పర్యావరణ వ్యవస్థ లో భాగంగా ఐసిఎంఆర్, కస్తూర్బా మెడికల్ కాలేజీ , డాక్టర్ టిఎంఎ పాయ్ రోటరీ ఆస్పత్రి సమష్టిగా ఈ ట్రయల్ రన్ నిర్వహించడం విశేషం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News