Wednesday, January 22, 2025

కాలేయ మార్పిడి అవసరం లేని కణ చికిత్స

- Advertisement -
- Advertisement -

కాలేయం చెడిపోతే కాలేయాన్ని దానం ఇచ్చే దాతల కోసం కొన్నేళ్లు నిరీక్షించక తప్పడం లేదు. అవయవ దానం ద్వారా కాలేయాలని స్వీకరించడం అంత సులువు కాదు. దాత అందించే కాలేయం రోగికి మార్చేటప్పుడు భౌతికంగా, వైద్య పరంగా చిక్కులు ఎదురవుతుంటాయి. కాలేయం మార్చిన తరువాత కూడా వైద్యపరమైన ఇబ్బందులు వెంటాడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో కాలేయం మార్పిడి అవసరం లేకుండానే చెడిపోయిన కాలేయాన్ని బాగు చేయగల కణ చికిత్సను పరిశోధకులు కనుగొన గలిగారు. కాలేయాన్ని మరమ్మతు చేయడంతోపాటు కాలేయ కండరాలను తిరిగి ఉత్పత్తి చేయగల కొత్త రకం కణాన్ని వెలుగు లోకి తెచ్చారు. ఒక కణం ఆర్‌ఎన్‌ఎను ఉపయోగించి ఈ కణం ఉనికిని కనుగొన్నారు. ఈ కణ విధానాన్ని హైపటో బిలియరీ హైబ్రిడ్ ప్రొజెనిటర్ ( హెచ్‌హెచ్ వైపి ) అని పిలుస్తారు. కాలేయం పెరుగుదలకు సంబంధించి హెపటోసైటిస్, బొలాంజియో సైటిస్ అనే రెండు ప్రధాన కణ విధానాలు తోడ్పడుతుంటాయి. ఈ పరిశోధనలో హెచ్‌హెచ్‌వైపిఎస్ ను పరీక్షించి చూడగా… ఎలుక లోని మూలకణాలతో ఇవి సరిపోతాయని లండన్‌కు చెందిన కింగ్స్ కాలేజీ పరిశోధకులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఎలుక కాలేయాన్ని ఈ కణాలు వేగంగా బాగు చేయడాన్ని గమనించారు. సిరోసిస్‌లో జరిగినట్టుగానే ఇక్కడ కూడా జరిగిందని, వాస్తవమైన మూలకణాలను ఈ కణాలు పోలి ఉండడాన్ని మొదటిసారి తాము చూశామని , మానవ కాలేయం లోనూ ఇవి ఉండగలవని తాము తెలుసుకున్నామని పరిశోధకులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News