Tuesday, November 5, 2024

అసెంబ్లీలో సెల్‌ఫోన్లు, వీడియోలు ప్రదర్శించరాదు

- Advertisement -
- Advertisement -

కీలక ప్రకటన చేసిన స్పీకర్

మనతెలంగాణ/హైదరాబాద్:  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. చైర్ అనుమతి లేకుండా శాసనసభలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వీడియోలు పదర్శించరాదని స్పీకర్ గడ్డం ప్రసాద్ రూలింగ్ ఇచ్చారు. గురువారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పలు అంశాలపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడవద్దన్నారు. బ్రేక్ టైం లేదా సభ వాయిదా తరువాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలన్నారు. శాసనసభలో భారతీయ జనతాపార్టీ ప్లోర్ లీడర్‌గా ఏలేటి మహేశ్వర రెడ్డిని ప్రకటించారు.అనంతరం ప్రభుత్వం శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. అందులో నీటిపారుదల శాఖకు సబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు, పంచాయతీరాజ్ ,రెవెన్యూ ,ఫైనాన్స్ రిపోర్టులను టేబుల్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News