Saturday, December 21, 2024

అలర్ట్.. కరీంనగర్ లో విజృంభిస్తున్న సెల్యూలైటిస్ వ్యాధి

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం మంకీపాక్స్ అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దీని కారణంగా మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలర్ట్ చేసింది. ఇటీవల ఇండియాలోనూ ఓ మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వైరల్ ప్రజలను భయపెడుతోంది. మొదట దురదతో ప్రారంభమై..క్రమంగా గాయంగా మారుతున్నది. ఇప్పటికే వందల కేసులు నమోదయ్యాయి.

సెల్యూలైటిస్ అనే ఈ వ్యాధి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే.. కానీ వ్యాధి తీవ్రతతో ప్రమాదకరంగా మారుతున్నది. ఈ చర్మ వ్యాధి ఎక్కువగా కాళ్లపై ప్రభావం చూపుతుంది.. నిర్లక్ష్యం వహిస్తే శరీర భాగాలకు సోకే ప్రమాదం ఉంది. సెల్యూలైటిస్ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. ప్రతి ఏటా పదుల సంఖ్యలో ఉండే ఈ వ్యాధి బాధితులు ఈసారి వందల్లో ఉన్నారు. ఈ వ్యాధి సోకిన వారు వెంటనే చికిత్స చేయించుకుంటే మేలని డాక్టర్లు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News