Monday, November 18, 2024

హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్ డ్రగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్ డ్రగ్.. ఉత్పత్తి చేయనున్న సెలోన్ ల్యాబ్స్

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే యాంఫోటెరిసిన్ బిని తయారు చేసేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. ఈ మందును సెలోన్ ల్యాబ్స్‌లో ఉత్పత్తి చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. తాము తయారు చేస్తున్న ఇంజక్షన్‌కు యాంఫోటెరిసిన్ బి ఎమల్షన్ అని నామకరణం చేసినట్లు సెలోన్ ల్యాబ్స్ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈసందర్బంగా ఆ ల్యాబ్ ఎండి ఎం నాగేష్‌కుమార్ మాట్లాడుతూ.. సెకండ్ వేవ్‌లో బ్లాక్ ఫంగస్ తీవ్రత అధికమవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

తాము ఉత్పత్తి చేస్తున్న మందు బ్లాక్ ఫంగస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందన్నారు. ప్రతి రోజు సుమారు 10వేల వయల్స్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా మన్నారు. దీంతో దాదాపు 6 వేల మంది రోగులకు ఉపశమనం కలుగుతుందని ఆయన చెప్పారు. సెలోన్ చైర్మన్ హోసిన్ సిడిసెడ్ మాట్లాడుతూ.. ఈ మందు ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు తమ సంస్థ ఉద్యోగులు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

Celon Labs develops Black Fungus drug in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News