Thursday, January 23, 2025

ఆర్‌టిసి బస్సును ఢీకొట్టిన సిమెంట్ లారీ… ఆరుగురి దుర్మరణం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో శనివారం బస్సు-లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్‌టిసి బస్సును అతివేగంగా వచ్చిన సిమెంట్ లారీ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. ట్రాఫ్రిక్‌ను క్లియర్ చేస్తున్నారు.

Also Read: ప్రజలు ఇంటి వద్ద నుంచి కచ్చితంగా స్టీల్ డబ్బాలను వెంటనే తెచ్చుకోవాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News