భారీగా 6 నుంచి 13 శాతం పెరగొచ్చు
ఉక్రెయిన్ష్య్రా సంక్షోభమే కారణం
ముంబై : దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు 6 నుంచి 13 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో దిగుమతి బొగ్గు, పెట్ కోక్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల సిమెంట్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం, కోల్, పెట్ కోక్ ధరలు గత 6 నెలల్లో 30 నుంచి 50 శాతం పెరిగాయి. వీటి ధరలు పెరగడానికి ప్రధానంగా కారణం ఉక్రెయిన్ష్య్రా యుద్ధమే కారణమని అంటున్నారు. క్రిసిల్ నివేదిక ప్రకారం, గత 12 నెలలుగా పెరిగిన ధరలతో దేశవ్యాప్తంగా సిమెంట్ బ్యాగ్ రేటు రూ.390కి చేరాయి. పెరిగిన ఖర్చులను తయారీ కంపెనీలు వినియోగదారులపై మోపడం ప్రారంభిస్తారని, ఏప్రిల్‌లో సిమెంట్ ధరలు మరో రూ.2550 పెరగనున్నాయని నివేదిక వివరించింది.
క్లింకర్‌కు బొగ్గు, పెట్ కోక్ ఎంతో కీలకమైన అంశం, సిమెంట్ తయారీ పరిశ్రమలో ఈ మెటీరియల్ ఎంతో ముఖ్యమైంది. బొగ్గు, పెట్ కోక్ ధరలు పెరగడంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయి. ఇది కూడా సిమెంట్ రా మెటీరియల్ ఉత్పత్తి వ్యయంపై దారుణంగా ప్రభావం చూపనుంది. ఇంకా ప్యాకేజింగ్ మెటీరియల్స్, ప్రొడక్షన్, రవాణా, పంపిణీ కూడా సిమెంట్ ధరలను పెంచనున్నాయని కనోడియా సిమెంట్ ఎండి విశాల్ కనోడియా తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం తర్వాత మార్చి నెలలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 21 శాతం పెరగ్గా, బ్యారెల్ రేటు సగటున 115 డాలర్లకు చేరింది. కనోడియా మాట్లాడుతూ, బొగ్గు, పెట్ కోక్ కొరత వల్ల సిమెంట్ ప్లాంట్ ఆపరేషన్ డి.జి సెట్‌కు డైవర్ట్ అవుతాయని, ఇది కూడా సిమెంట్ ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుందని అన్నారు.