Monday, December 23, 2024

“ ఖేలో ” కేంద్రాల మంజూరులోనూ కేంద్రం వివక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు 34 ఖేలో ఇండియా సెంటర్లను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం అదే తెలంగాణ రాష్ట్రానికి కేవలం 17 ఖేలో ఇండియా సెంటర్లను మాత్రమే మంజూరు చేసిందని తెలంగాణ రాష్ట్ర మాజీ స్పోర్ట్ ఛైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి ఆదివారం నాడొక ప్రకటనలో విమర్శించారు. ఈ చర్య తెలంగాణపై వివక్షను, నిర్లక్ష వైఖరిని మరొక సారి రుజువు చేసిందని మండిపడ్డారు. ఈ మేరకు గత 6 నెలల నుండి తెలంగాణ రాష్ట్రానికి ఖేలో ఇండియా సెంటర్లు వివిధ క్రీడా అంశాలలో ముంజూరు చేయాలని దరఖాస్తులు చేసుకోగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు కేవలం 17 ఖేలో ఇండియా సెంటర్లను తెలంగాణకు మంజూరు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులను కేంద్రం జారీ చేసిందన్నారు.

ఇవి సరిపోవని, ఇంకా పెద్ద సంఖ్యలో ఖేలో ఇండియా సెంటర్లను, తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు.తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని యువత క్రీడల్లో గొప్పగా ఎదిగి రాణిస్తోందన్నారు. వీరంతా క్రీడల్లో గొప్పగా ఎదిగి భారత దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ 17 క్రీడా ఖేలో ఇండియా సెంటర్లను త్వరలో ప్రారంభించుకుని శిక్షణ ప్రారంభం అయ్యేలా ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలోనే అన్ని రాష్ట్రాలలో కెల్లా కూడా అత్యుత్తమమైన స్పొర్ట్ పాలసీని తీసుకొచ్చి క్రీడా అకాడమీలతో పాటు గ్రామీణ క్రీడాకారులకు పెద్ద పీట వేసి ఒలంపియన్లుగా తీర్చిదిద్దబోతుందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News