Friday, December 20, 2024

దీపిక కాషాయం స్విమ్‌సూట్‌పై సెన్సార్ అభ్యంతరం

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: షారుఖ్ ఖాన్, దీపికా పడుకోన్ నటించిన పఠాన్ చిత్రంలోని కొన్ని సిన్నివేశాలను, పాటలను మార్చాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సిబిఎఫ్‌సి) ఆ చిత్ర నిర్మాతలను ఆదేశించింది. షారుఖ్ ఖాన్‌తో కలసి నటించిన బేషరం అనే పాటలో దీపిక ధరించిన కాషాయం రంగు స్విమ్ సూట్‌పై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన దరిమిలా ఆ పాటలోని సన్నివేశాలను మార్చాలంటూ పఠాన్ నిర్మాతలను కోరినట్లు సిబిఎఫ్‌సి చైర్మన్ ప్రసూన్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటీవల ఈ చిత్రాన్ని సెన్సార్ చేసేందుకు సిబిఎఫ్‌సి అధికారులు తిలకించారు. మన సంస్కృతి, విశ్వాసాలు ఎంతో గొప్పవని, వాటిని గౌరవించుకోవలసి ఉంటుందని జోషి తెలిపారు. బేషరం పాటలోని దృశ్యాలపై కొందరి నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో చిత్ర నిర్మాతలు, ప్రేక్షకుల మధ్య పరస్పర విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు. మార్చిన దృశ్యాలతో మళ్లీ చిత్రాన్ని సెన్సార్‌కు పంపాలని పఠాన్ నిర్మాతలను కోరినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో పఠాన్ హిందీతోపాటు తెలుగు, తమిళం భాషలలో విడుదల కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News