Sunday, December 22, 2024

కులగణన చేయాల్సింది కేంద్రమే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో తాము తప్పితే ఏ ఇతర సంస్థ కులాలవారి జనగణనకు దిగరాదని, ఈ మేరకు ఆదేశాలు వెలువరించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియచేసుకుంది. సోమవారం ఈ మేరకు కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. తన వాదనతెలియచేసుకుంది. 1948 నాటి సెన్సస్ యాక్ట్‌లో సంబంధిత విషయంపై స్పష్టత ఉందని, కేవలం కేంద్రమే ఈ కులగణనకు దిగాల్సి ఉందని పొందుపర్చారని గుర్తు చేశారు. కేంద్రం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కానుంది. తాము ఈ నెల 6వ తేదీననే కులగణన సర్వే పూర్తి చేసినట్లు , సంబంధిత వివరాలను ఈ నెల 12నే అప్‌లోడ్ చేసినట్లు ఇంతకు ముందు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు ఇటీవలే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కేంద్రం తరఫు వాదనకు ఆదేశించింది. ఏడు రోజుల వ్యవధిలో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఇప్పుడు కేంద్రం తన అఫిడవిట్ సమర్పించింది. కులగణన అధికారం కేంద్రానికే ఉందని తెలిపిన తుషార్ మెహతా దేశంలోని ఎస్‌టిలు,

ఎస్‌టిలు, ఎస్‌ఇబిలు, ఒబిసిల అభ్యున్నతికి రాజ్యాంగ పరిధిలో, చట్టపరమైన నిబంధనల క్రమంలో కట్టుబడి ఉంటుందని వివరించారు. కాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదిక వివాదాస్పదం అయింది . నివేదికను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే వీటిని బీహార్ హైకోర్టు తోసిపుచ్చింది. కులాల వారి సర్వేను సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన కులగణన పద్ధతి ప్రకారమే జరిగిందని, ఇందులో తప్పేమీ లేదని, న్యాయబద్ధంగా అందరికీ సమతూకపు అభివృద్ధి దిశలో అవకాశాలు కల్పించాలనే కోణంలోనే చట్టబద్ధంగా ఈ సెన్సస్ జరిగిందని హైకోర్టు తన 101 పేజీల తీర్పులో తెలిపింది. కేంద్రం తన వాదనను స్పష్టం చేసిన దశలో ఇకపై సుప్రీంకోర్టు ఈ నివేదికపై ఎటువంటి స్పందన వెలువరిస్తుందనేది కీలకంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News