Tuesday, December 24, 2024

నేటి నుంచి కులగణన

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహణ ఈ నెల ౩౦ వరకు
కొనసాగింపు సర్వేలో పాల్గొననున్న 85 వేల మంది ఎన్యూమరేటర్లు
36,559 మంది ప్రాథమిక పాఠశాలల ఎస్‌జిటి ఉపాధ్యాయులు
3414 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు
మిగతా వారిలో ప్రభుత్వ మినిస్టీరియల్ ఉద్యోగులు
సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లకు ఒంటిపూట బడులు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న కులగణ న కార్యక్రమం బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ప్రారంభం కానున్నది. కులగణన సర్వే బాధ్యతలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించగించడంతో సర్వే పూర్తయ్యేవరకు ఒంటిపూట మాత్రమే పనిచేయనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 గం టల నుంచి మధ్యాహ్నంఒంటి గంట వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. ఆ తర్వాత కులగణన సర్వే కార్యక్రమం కొనసాగనున్నది. ఇందులో 85 వేల మంది పాల్గొననుండగా, అందులో 36,559 మంది ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఎస్‌జిటి ఉపాధ్యాయులు, 3414 మంది ప్రాథమిక పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు కాగా మిగతా వారిలో ప్రభుత్వ మినిస్ట్రీయల్ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొనున్నారు. అయితే ఈ సర్వే నుంచి ప్రా థమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మినిహాయిం పు ఇచ్చింది.

పార్ట్-1లో యజమాని, కుటుంబసభ్యులు

ఇంటింటికీ సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపా ధి, రాజకీయ, కులాల సర్వే)కులగణనను సంబంధించిన ప్రశ్నావళిని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 56 ప్రధాన ప్రశ్నలతో పాటు 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలను ఖరారు చేసింది. పార్ట్-1లో యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధిం చి 58 ప్రశ్నలుండగా పార్ట్-2లో కుటుంబ వివరాలకు సం బంధించి 17 ప్రశ్నలున్నాయి. మొత్తం 7 పేజీల్లో వీటిని పూరించాల్సి ఉంటుంది. కుటుంబ యజమానితో పాటు కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. పార్ట్-1లో వ్యక్తిగత వివరాల్లో మతం, సామాజిక వర్గం, కులం, ఉప కులంతో పాటు మాతృభా ష, వైవాహిక స్థితి, పాఠశాల రకం, విద్యార్హత, ఉద్యోగం, ఉపాధి, కుల వృత్తి, వార్షిక ఆదాయం, ఐటి రిటర్న్, స్థిరాస్తులు, ధరణి పాసుబుక్ నెంబర్, రిజర్వేషన్‌తో పొందిన ప్రయోజనాలు, గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన సంక్షేమ పథకాల పేర్లు, రాజకీయ నేపథ్యం, వలస వివరాలను సేకరిస్తారు.

కుటుంబ వివరాలు పార్ట్-2లో నమోదు

కుటుంబ వివరాలు పార్ట్-2లో నమోదు చేస్తారు. ఇందులో గత ఐదేళ్లలో తీసుకున్న రుణాల వివరాలు, పశుసంపద, స్థిరాస్తి, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు నెంబర్, నివాస గృ హం రకం, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్ వివరాలు తెలపా ల్సి ఉంటుంది. ఆధార్ వివరాలు తప్పనిసరి కాదని ఇం దులో స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే లాంటి ప్రశ్నలనే ప్రభుత్వం ఇందులో పొందుపరిచింది.

గత సర్వేలో 8 అంశాలు.. 94 ప్రశ్నలు

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలోని కోటి గృహాలు, 3.68 కోట్ల జనాభాకు సంబంధించి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించింది. అప్పటి సర్వేలో 8 అంశాలకు సంబంధించి 94 ప్రశ్నలకు సమాధానాలు సేకరించింది. గతంలో నిర్వహించిన సర్వేలో ఆ ధార్ వివరాల నమోదు తప్పనిసరి చేయగా ప్రస్తుత కులగణన సర్వేలో దీనిని ఐచ్ఛికమని పేర్కొన్నారు.

30లోపు పూర్తయ్యేలా….

నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వేను ఈనెల 30లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి 150 ఇం డ్లకు, 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పర్యవేక్షణ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇక గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు సైతం ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు ప్రతిరోజు 5 నుంచి 7 ఇళ్లను సందర్శించనున్నా రు. ఈ నేపథ్యంలోనే ఎన్యుమరేటర్‌లకు, సూపర్‌వైజర్‌లకు, ఇతర సిబ్బందికి పారితోషకం చెల్లించనున్నట్టు ప్ర భుత్వం ప్రకటించింది.

అయితే సర్వే జరిగే ప్రతి గ్రామంలో ముందు గా డప్పు చాటింపు వేయించాలని, సర్వే నిర్వహించే సమయంలో కలెక్టర్‌లు క్షేత్రస్థాయిలో తిరిగి తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నిర్వహణకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆరు జోన్లుగా విభజించి 28 వేల మంది ఎన్యుమరేటర్‌లను ప్రభుత్వం నియమించింది. సర్వే నిర్వహణకు ఎంపిక చేసిన వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News