Wednesday, January 22, 2025

జనగణనకు కేంద్రం నై

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల కు ముందు దేశంలో జనగణన జరి గే అవకాశం లేదు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఆదివారం తెలిపా యి. ఈ దశాబ్దంలో దేశంలో అధికారికంగా సెన్సస్ జరగాల్సి ఉంది. అయితే కొవిడ్ కారణంగా దీనిని ని రవధింకగా వాయిదా వేశారు. నిర్ణీ త గడువు ప్రకారం దేశంలో ఇం టింటివారీగా జనగణన ప్రక్రియ, తద్వారా జాతీయ జనాభా చిట్టా ( ఎన్‌పిఆర్)ను 2020 ఎప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ నిర్వహించాలి. ఆ దశలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల దీనిని వాయిదా వేశారు, దేశంలో నిర్ణీత సమయం ప్రకారం చూస్తే వచ్చే ఏడాది ఎప్రిల్ లేదా మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ లోగా జనగణన ప్రక్రియ జరిగే అవకాశం లేదని , పాత షెడ్యూల్ బదులు కొత్త షెడ్యూల్‌ను ఇప్పటివరకూ ఖరారు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండటం, ఈ ఏడాది అక్టోబర్ నుంచి వివిధ స్థాయిల్లో ఎన్నికల ప్రక్రియకు సన్నాహాలు జరగాల్సి ఉండటంతో ఈలోగా సెన్సస్ కుదరదని తెలిపారు. ఎన్నికల సంఘం, రిజిష్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషన్ ఎన్నికల నిర్వహణ పనులలో నిమగ్నం కావల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా సవరణలు, తుది జాబితా రూపకల్పన వంటి పలు ప్రక్రియలు ఉండటం వల్ల , ఇప్పటి పరిస్థితుల్లో ప్రాధాన్యతాక్రమాలు మారడం వల్ల సెన్సస్ కుదరదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఏ దశలో జనగణన జరిగినా ప్రజల నుంచి దాదాపు 31 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకుంటారు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, లాప్‌ట్యాప్, కంప్యూటర్ , కారు, ద్విచక్రవాహనాలు , తీసుకునే ప్రధాన ఆహారం వంటి వాటిపై సమాధానాలు రాబట్టుకుంటారని వెల్లడైంది.

సాధారణంగా దేశంలో అతి భారీ స్థాయి ప్రక్రియ అయిన జనగణనను సెప్టెంబర్ 30 తరువాత మూడు నెలల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలు, ఉప జిల్లాలు, తాలూకాలు, తహసీల్స్ , పోలీసు స్టేషన్లు వంటి పరిమితులను ఖరారు చేసుకోవడం ప్రధాన విషయం. రెండు నెలల పాటు జనాభా సేకరణకు దిగే దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు దేశవ్యాప్తంగా తగు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు జనగణన సాధ్యం కాదని తేల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. జనగణనలో భాగంగా పౌరుల జీవనస్థితిగతులను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ మేరకు 31 అంశాల ప్రశ్నావళిని ఖరారు చేసినట్లు వెల్లడైంది. తినే ఆహారం, తాగునీటి వనరులు, విద్యుత్ ఏర్పాట్లు, మరుగుదొడ్ల సౌకర్యాలు, వీటి రకాలు ,

వృధానీటిమురుగునీటి పైపుల ఏర్పాట్లు, స్నాన సౌకర్యాలు, వంట ఏర్పాట్లు, వంటగ్యాసు, పిఎన్‌జిల అనుసంధానం , వంటకు వాడే ప్రధాన ఇంధనం, రేడియో, ట్రాన్సిస్టర్, టీవీ వంటివి ఉన్నాయా? అనే విషయాలను తెలుసుకుంటారు. నివాసిత గృహాల ఫ్లోరు, గోడలు, పై కప్పులకు ప్రధానంగా వాడే సరుకు, వీటి పరిస్థితిని ఆరా తీస్తారు. ఇంటిపెద్ద ఎవరు? మహిళనా, లేక పురుషుడా, ఇక ఇంటిపెద్ద ఎస్‌సి, ఎస్‌టికి చెందినట్లు అయితే ఇంట్లో ఉన్న గదులు, వీటిలో అద్దెకు ఇచ్చినవి ఎన్ని? సొంతంగా వాడుకుంటున్నవి ఎన్ని? ఇళ్లల్లో ఉన్న పెళ్లయిన జంటలు ఎన్ని అనే వివరాలను సేకరిస్తారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News