- Advertisement -
న్యూఢిల్లీ : ఎన్నికలు తరువాతి దశలో మీడియా వ్యవహరిస్తున్న తీరు జర్నలిజపు విలువకు అనుగుణంగా లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. మాతృభూమి పత్రిక శతజయంతి ఉత్సవాల సందేశంలో ఆయన స్పందన వెలువడింది. కేరళలో ఎన్నికల దశలో మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని విమర్శించార. వారు ఓ పార్టీ తరఫున ప్రచారానికి దిగినట్లుగా పనిచేశారని, ప్రచారానికి జర్నలిజానికి తేడా లేకుండా చేశారని అన్నారు. బిజెపి పట్ల అనసవర ద్వేషం చాటడటం మీడియాకు అలవాటు అయింది. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధిస్తే కొందరు జర్నలిస్టులు ప్రత్యేకించి యుపిలో పరిణామంపై తమ స్పందనలో ఈ విజయంతో ప్రజలకు ఏదో చేటు కల్గిందనే విధంగా వ్యాఖ్యానాలు వెలువరించారని , ఇది దారుణం అన్నారు. నిజాలు కాకుండా అభిప్రాయాలు ప్రజలకు వ్యక్తం చేయడం జర్నలిజం అవుతుందా? అని ప్రశ్నించారు.
- Advertisement -