Sunday, December 22, 2024

కేంద్రం, రాష్ట్రాలకు సమాన అధికారాలుంటాయి

- Advertisement -
- Advertisement -

Center and the states have equal powers

మండలి సిఫార్సులకు కట్టుబడాల్సిన అవసరం లేదు
అయితే మనది సహకార సమాఖ్య వ్యవస్థ అయినందున చర్చలు అవసరం
జిఎస్‌టి చట్టాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: జిఎస్‌టి( వస్తు, సేవల పన్ను) మండలి సిఫార్సులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్నందున వాటికి విలువ ఇవ్వాలని సూచించింది.జిఎస్‌టి చట్టాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలు ఉంటాయని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్‌లు కూడా ఈ బెంచ్‌లో ఉన్నారు. సముద్రంలో సరకు రవాణాపై 5 శాతం ఐజిఎస్‌టి విధిస్తూ 2017లో కేంద్రప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను గుజరాత్ హైకోర్టు రద్దు చేసింది. ఓడలో సరకు రవాణాకు ఎలాంటి ఐజిఎస్‌టి విధించాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.

ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్‌జిఎస్‌టి మండలి సిఫార్సులపై కీలక వ్యాఖ్యలు చేసింది.‘ జిఎస్‌టి కౌన్సిల్ చేసిన సిఫార్సులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఆరికల్ 246 ఎప్రకారం .. పన్నులపై చట్టాలు చేసుకునే విషయంలో పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభలకు సమాన హక్కులున్నాయి. జిఎస్‌టిపై కేంద్రం, రాష్ట్రాలు విడివిడిగా చట్టాలు చేసుకోవచ్చు. అయితే మనం సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్నందున ఆర్టికల్ 279 ప్రకారం.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరించకూడదు. జిఎస్‌టి చట్టాల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తే .. జిఎస్‌టి మండలి సరైన సలహా ఇవ్వాలి. ఆచరణీయ పరిష్కారం కోసం సామరస్యంగా పని చేయాలి.ఒకరి అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్దకుండా చర్చించుకోవాలి. ఈ చర్చల ఆధారంగానే జిఎస్‌టి ప్రతిపాదనలు చేయాలి’ అని ధర్మాసనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News