- Advertisement -
న్యూఢిల్లీ : నేషనల్ కమిషన్ ఫర్ అలిడ్, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. గత వారమే ఈ బిల్లును ఎగవసభ ఆమోదించింది, దీనితో బిల్లు పార్లమెంట్ సమ్మతిని దక్కించుకున్నట్లు అయింది. వైద్య చికిత్స అనుబంధ రంగాలలో వృత్తినిపుణులకు సంబంధించి వారివిద్యా ప్రమాణాలలో సార్వత్రికత కీలకమైన విషయం. దీనిని సరైన విధంగా పర్యవేక్షించేందుకు కేంద్రం కమిషన్ ఏర్పాటు ప్రతిపాదన తీసుకువచ్చింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ మూజవాణితో ఆమోదించింది. బిల్లుపై చర్చకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ సమాధానం ఇచ్చారు. సంబంధిత రంగంలో చిరకాల లోటుపాట్లు, డిమాండ్లు పరిష్కరించేందుకు , వృత్తి నిపుణులకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి చట్ట ప్రక్రియ అత్యవసరం అన్నారు.
- Advertisement -