Friday, November 22, 2024

దిగొచ్చిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Center approves purchase of another 6 lakh metric tonnes of rice

సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల బృందం పోరాట ఫలితం

మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం

ఖరీఫ్ సీజన్‌లో అదనపు సేకరణకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ సమాచారం
తాజా నిర్ణయంతో 46లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనున్న బియ్యం సేకరణ
రాష్ట్రంలో 68.65లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించనున్న రాష్ట్రం
మొండివైఖరి అవలంబించిన కేంద్రాన్ని పట్టుదలతో ఒప్పించగలిగిన రాష్ట్ర బృందం

మనతెలంగాణ/హైదరాబాద్ : పండించిన ప్రతి ధాన్యం గింజను కొనాలన్న డిమాండ్‌తో ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజులుగా చేస్తున్న పోరాటం సఫలీకృతమవుతున్నది. బియ్యం కొనుగోలుపై మొండికేస్తూ వచ్చిన కేంద్రం టిఆర్‌ఎస్ అలుపెరగని ఒత్తిడితో దిగివచ్చింది. తెలంగాణ నుంచి మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ జరిపేందుకు మంగళవారం నాడు కేంద్రం ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు లేఖ ద్వారా సమాచారం అందించింది. వర్షాకాల సీజన్‌లో వరి అంచనాలకు మించి సాగులోకి వచ్చినందున రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు లభించాయి. రాష్ట్రంలో 62లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపి ఆమేరకు ధాన్యం సేకరణ లక్ష్యాలను పెంచాలని కోరింది. అయతే తమ వద్ద ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో వరిసాగు 62లక్షల ఎకరాలు లేదని, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు పెంచిచూపుతోందని కేంద్రం సాకు చెప్పి ధాన్యం సేకరణ లక్ష్యాల పెంపుదలలో దాటవేత ధోరణి అవలంబించింది.

రాష్ట్ర ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా వరిసాగు లెక్కలు కేంద్రం ముందు పెట్టడంతో జరిగిన పొరపాటు తెలుసుకున్న కేంద్రం తమ వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్ర వరిసాగు విస్తీర్ణపు లెక్కలను సరిచేసుకుంది. ఆ తర్వాత కూడా ధాన్యం సేకరణ పెంపుదలకు ససేమిరా అని మొండికేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ రంగంలోకి దిగి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఆరగురు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి పంపారు. కేంద్రంతో ఈ బృందం ద్వారా చర్చలు జరిపించారు. ఎట్టకేలకు సిఎం కేసిఆర్ కృషి, రాష్ట్ర మంత్రుల బృందం చర్చలు ఫలించాయి. వానాకాలం సీజన్‌లో పండించిన ధాన్యం అదనంగా సేకరించేందకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. గతంలో 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం ఒప్పుకుంది. తాజాగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించేందకు నిర్ణయం తీసుకొంది. దీంతో తెలంగాణ రాష్ట్రం వర్షాకాల సీజన్‌లో ఉత్పత్తి అవుతున్న ధాన్యంలో 68.65లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనుంది.

80లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి: మారెడ్డి

రాష్ట్రం నుంచి 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం సవితితల్లి ప్రేమను చూపిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వానాకాలంలో అదనంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవడానికి కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వడంపై మారెడ్డి స్పందిస్తూ.. పంజాబ్ కు, హర్యాణకు, తెలంగాణకు ఒక్కో విధానం అన్నట్లుగా కేం ద్రం వ్యవహరిస్తోందన్నారు. పంజాబ్‌లో కోటి 85 లక్షల మెట్రిక్ టన్ను లు, హర్యాణలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకున్న కేం ద్రం తెలంగాణకు వచ్చేవరకు 2 లక్షలు, 6 లక్షలు అంటూ బేరాలు ఆడుతోందన్నారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని గాని.. తెలంగాణ ప్రభుత్వం అడిగినట్లుగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుంటామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. పంజాబ్ నుంచి కర్ణాటకకు ఎఫెసీఐ బియ్యాన్ని సరఫరా చేస్తోం ది. పక్కన్నే ఉన్న తెలంగాణ నుంచి ఎందుకు సరఫరా చేయడం లేదు అని మారెడ్డి ప్రశ్నించారు.ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతు సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ డ్రామాలు అడుతోందని.

మరోవైపు రాష్ట్రంలో దిక్కుముక్కు లేని కాంగ్రెస్ పార్టీ, ఆపార్టీ అధ్యక్షులు రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని అన్నారు. రైతులు యాసంగిలో వడ్లు పండించాలని.. ప్రభు త్వం మెడలు వంచైనా కొనుగోలు చేయిస్తామని రైతులను రెచ్చగొట్టే విధంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి తన ఉనికిని చాటుకోవడానికి.. కాంగ్రెస్ పార్టీ పెద్దల మెప్పు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదు కాబట్టి వరిపంట వేసి రైతాంగం ఆర్థికంగా నష్టపోకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సంక్షేమాన్ని కాంక్షించి వరి వేయొద్దని పిలుపునివ్వడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాలు పెట్టబోమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేశారని, గన్నీ సంచుల కోసం ధర్నాలు చేశారని, విత్తనాల కోసం లాఠీ దెబ్బలు తిని, పోలీసు కాల్పుల్లో రైతులు మరణించారన్నా రు. ఎంత ఆర్థిక భారమైనా కూడా లెక్కచేయకుండా రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇదే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ 2014- నుండి ఈ రోజు వరకు దాదాపు 96 వేల కోట్ల రూ పాయలతో 6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News