Friday, January 10, 2025

విదేశీ బొగ్గుపై పీఛేముడ్

- Advertisement -
- Advertisement -

Center back on foreign coal import

రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో వెనక్కి
తగ్గిన కేంద్రం అన్ని రాష్ట్రాల
విద్యుత్ సంస్థలకు ప్రయోజనం
బొగ్గు కొరత లేకున్నా విదేశీ బొగ్గు
కొనాలని గతంలో కేంద్రం హుకుం

మన తెలంగాణ/హైదరాబాద్: విదేశీ బొగ్గు దిగుమతిపై కేంద్రం వెనక్కితగ్గింది. ఆదానీ గ్రూపుకు మేలు చేయడంలో భాగంగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సిఎం కెసిఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ప్రస్తు తం విదేశీ బొగ్గును కొనాల్సిన పరిస్థితి అవసరం లేదని పేర్కొంటూ లేఖ రాయడంతో అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఊపిరిపీల్చుకున్నాయి. గతంలో సిఎం కెసిఆర్ ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాయడంతో పాటు విదేశీ బొగ్గు దిగుమతిపై పెట్టిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని స్వయంగా ప్రధానిపై కెసిఆర్ ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్రం సైతం పక్కకు పెట్టింది. రెండు రోజుల క్రితం దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు లేఖ రాసింది. విదేశీ బొగ్గు కొనుగోలు ఒత్తిడి వెనుక ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో భారీ ఎత్తున అదానీ బొగ్గు బ్లాకులు ఉండటమే కారణమని పలు రాష్ట్రాలు సైతం కేంద్రంపై ఆరోపణలు చేశాయి.

ఒకవేళ ఆదేశాలను పాటించకపోతే….

విదేశీ బొగ్గు కొనుగోళ్లను రాష్ట్రాలకు తప్పనిసరి చేయడంతో పాటు ఏప్రిల్ నెలలో 10 శాతం విదేశీ బొగ్గు దిగుమతుల కోసం రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో)లు ఆర్డర్ ఇవ్వకపోయినా, జూన్ 15 వ తేదీ నాటికి జెన్‌కోల విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు రాక ప్రారంభం కాకపోయినా ఈ కొరతను తీర్చడానికి జరిమానా కింద 2023 ఏప్రిల్- నుంచి జూన్ మధ్య కాలంలో ఏకంగా 15 శాతం వరకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు సంబంధిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు దేశీయ బొగ్గు కేటాయింపులను ప్రతి నెలా 5 శాతం వరకు తగ్గించుకుంటూ పోతామని హెచ్చరించింది.

రాష్ట్ర జెన్ కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సింగరేణి నుంచి బొగ్గు లభ్యత పుష్కలంగా ఉన్నా తప్పనిసరిగా విదేశీ బొగ్గును కొనాలని కేంద్రం ఒత్తిడి చేసింది. ఇదే అంశంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్, ఆ శాఖ అధికారులు సైతం రెండు రోజులకు ఒకసారి అన్ని రాష్ట్రాల జెన్‌కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విదేశీ బొగ్గు కొనుగోళ్ల గురించి ఆరా తీశారు. అయితే మన రాష్ట్రంలోని ప్లాంట్లకు బొగ్గు కొరత లేదని, విదేశీ బొగ్గు అవసరం లేదని కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. మన దగ్గర బొగ్గు ధర టన్నుకు రూ.11,255లు ఉండగా, విదేశాల్లో బొగ్గుధర టన్నుకు రూ.32,210 లుండగా కేంద్రం అన్ని రాష్ట్రాలపై అదనపు భారం వేయాలని భావించి చివరకు తలొగ్గింది.

కెసిఆర్ ఒత్తిడి వల్లే కేంద్రం వెనక్కి
ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు

సిఎం కెసిఆర్ మొదటినుంచి తెచ్చిన ఒత్తిడి వల్ల కేంద్రం దిగొచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు అన్నారు. దీనివల్ల అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు మేలు జరిగిందని, మాములుగా మనం ఎన్‌టిపిసి నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తాం, దానికి రూ.4.20 పైసలు చెల్లిస్తాం, కానీ, కేంద్రం గతంలో విదేశీ బొగ్గు కొనాలన్న నిబంధనను తీసుకురావడంతో ఎన్‌టిపిసి అదనంగా 30 నుంచి 35 పైసలు చెల్లిం చాల్సి వస్తుందన్నారు. దీనివల్ల డిస్కంలపై అదనపు భారం పడుతోందన్నారు. ప్రస్తుతం కేంద్రం ఈ అంశంపై వెనక్కి తగ్గడం వల్ల డిస్కంలపై ప్రస్తుతం అదనపు భారం తగ్గినట్టేని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News