Monday, December 23, 2024

పోలీస్ పతకాలు ప్రకటించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ నుంచి 34 మంది,
ఎపి నుంచి 29 మందికి పోలీస్ సేవా పతకాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన పలువురికి పోలీస్ సేవా పతకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలు ప్రకటించింది. ఒక్కరికి రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం, 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు దక్కగా, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు లభించాయి. రాష్ట్రానికి చెందిన 22 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, పది మందికి పోలీస్ సేవా పతకాలు ప్రకటించారు. వీరితో పాటు ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ పతకం, అదనపు డీజీ విజయ్ కుమార్, ఎస్‌పి మాదాడి రమణ కుమార్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాన్ని కేంద్రం అందించనుంది.
రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు : అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్, ఎస్‌పి మదాడి రమణ కుమార్
పోలీస్ గ్యాలంటరీ పతకాలు : ఎస్‌పి భాస్కరన్, ఇన్‌స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్‌ఐ రమేష్, ఎస్‌ఐ బండారి కుమార్, ఆర్‌ఎస్‌ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కాన్‌స్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్, కానిస్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్ గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో ఉన్నారు.
పోలీస్ సేవా పతకాలు: ఖైరతాబాద్ అదనపు ఎస్‌పి బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్‌పిలు రామకృష్ణ ప్రసాద్ రావు, ఆత్మకూరి వెంకటేశ్వరి, ఆర్‌ఎస్‌ఐలుఆందోజు సత్యనారాయణ, కక్కెర్ల శ్రీనివాస్, మహంకాళి మధు, ఆర్‌ఐ అజెల్ల శ్రీనివాస రావు, సీనియర్ కమాండో రసమోని వెంకటయ్య, హైదరాబాద్ ఇన్‌స్పెక్టర్ అరవేటి భానుప్రసాద్‌రావు, ఎఎస్‌ఐ సాయన వెంకటేశ్వర్లు.
ఎపిలో 29 మందికి…
ఎపిలో 29 మంది పోలీసులకు ఈ పతకాలు దక్కాయి. ఒక్కరికి రాష్ట్రపతి పోలీస్ విశిష్ఠ సేవా పతకం, 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, 10 మందికి విశిష్ఠ సేవా పతకాలు లభించాయి. ఈ పతకాలను ప్రతి సంవత్సరం స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాలకు ప్రకటిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News