హైదరాబాద్: కోవిడ్ టీకాల పంపిణీలోనూ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో రోజుకు లక్షా 50 వేల వరకు కరోనా పరీక్షలు చేస్తున్నామని ఈటల పేర్కొన్నారు. ఆర్టీపిసిఆర్ పరీక్షల ఫలితాలకు ఆలస్యమవుతోందన్నారు. రోజుకు 30 వేల ఆర్టీపిసిఆర్ పరీక్షలు మాత్రమే చేయగలమని మంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే పరీక్షలు సంఖ్య పెంచాల్సిందేనని ఆయన చెప్పారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు డబ్బు కట్టల్లేదని రోగులను గాంధీ ఆసుపత్రికి పంపుతున్నాయని మంత్రి సూచించారు. గాంధీలో తొలిసారి 600 మందికిపైగా ఐసియులో ఉన్నారు.
రోగుల పరిస్థితి తీవ్రం దాల్చిన తర్వాత గాంధీకి పంపుతున్నారని వ్యాఖ్యనించారు. ప్రైవేట్ ఆస్పత్రులు మొదట్నుంచే రోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు వస్తున్నాయి. ఈ నెల 21 వరకు రెమ్ డెసివిర్ ను రాష్ట్రమే కొనుగోలు చేసింది. గాంధీలో ఆక్సిజన్ పడకలు ఉన్నాయి.. వెంటిలేటర్లు ఖాళీ లేవన్నారు. టిమ్స్ లో వెంటిలేటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 6వేల పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇతర రాష్ట్రాల రోగులే అధికం అని ఈటల వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రానికి చెందిన రోగులే మాత్రమే ఉన్నారని మంత్రి ఈటల పేర్కొన్నారు.
Center discriminates in vaccine distribution: Etela Rajender