- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలన్న కేంద్రం ప్రణాళిక “పంపిణీ వ్యూహం కాదు.. టీకా వివక్ష” అని కాంగ్రెస్ నాయకుడు, ఎంపి రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. రాహుల్ ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ.. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్లు లేవని, బలహీన వర్గాలకు టీకా హామీ కూడా లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం పేదలకు వ్యాక్సిన్ భరోసా కల్పించలేకపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. నియంత్రణ లేని ధరలతో దళారుల దోపిడీకి అవకాశముందన్నారు. మే 1 నుండి 18 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ కోవిడ్ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
Center discriminates in vaccine distribution says Rahul
- Advertisement -