Wednesday, January 22, 2025

15 లక్షల కాలం చెల్లిన వాహనాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాలం చెల్లిన వాహనాలపై కేంద్రం దృష్టిసారించింది. 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్లు దాటిన వాహనాల లెక్కలను సేకరించింది. తాజాగా ఇప్పటివరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో కా లం వాహనాలు దేశవ్యాప్తంగా 4 కోట్ల వాహనాలుండగా, అందులో 2 కోట్లకుపైగా వా హనాలు 20 ఏళ్లకుపైబడినవే అని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర రవాణాశాఖ అధికారులు అప్రమత్తమై రాష్ట్రంలో 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు సంబంధించి డేటాను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 30 లక్షల పైచిలుకు వాహనాలు ఉండగా, అందులో సగానికి పైగా వాహనాలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు సుమారు 15 లక్షల వరకు, 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు సుమారు 3.12 లక్షల వరకు ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీన్‌ట్యాక్స్ భారీగా విధించాలని నిర్ణయించడంతో 15 ఏళ్లు దాటిన వాహనాల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించి వాటికి గ్రీన్‌ట్యాక్స్ చెల్లించాలని ఆయా వాహనదారులకు నోటీసులు జారీ చేస్తోంది.

మొదటిస్థానంలో కర్ణాటక..

దేశవ్యాప్తంగా 4 కోట్ల వాహనాల్లో 2 కోట్లకుపైగా వాహనాలు 20 ఏళ్లకు పైగా తిరిగినవేనని కేంద్రం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా పాత వాహనాలను కలిగిన రాష్ట్రంగా కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా, ఈ రాష్ట్రంలో ఏకంగా 70 లక్షల పైచిలుకు పాత వాహనాలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 59.93 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 56.54 లక్షల పాత వాహనాలు ఉండగా తెలంగాణలో 15.58 లక్షల పైచిలుకు ఉన్నాయని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ద్విచక్ర వాహనానికి రూ.300లు

ప్రస్తుతం కాలుష్య నివారణలో భాగంగా రాష్ట్రంలో 8 ఏళ్లకు పైబడిన రవాణా వాహనాలకు రవాణాశాఖ గ్రీన్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది. రవాణా వాహనాలకు వాహనాన్ని బట్టి గ్రీన్ టాక్స్ ఉంటుంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణ సమయంలో ఈ ట్యాక్స్‌ను వసూలు చేస్తారు. 15 ఏళ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో పన్నును రవాణా శాఖ వసూలు చేస్తోంది. గతంలో అతి తక్కువ ఉండే ఈ పన్నులను ఏప్రిల్ నుంచి భారీగా పెంచడంతో ఈసారి రవాణాశాఖ భారీగా ఆదాయం సమకూరుతుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్యాక్స్‌లను పెంచిన తరువాత 15ఏళ్ల దాటిన ద్విచక్ర వాహనాలకు రూ.1,000, కార్లకు రూ.5,000లు, విదేశీ వాహనానికి రూ.40,000, ఫిట్‌నెస్ రుసుం కింద ట్యాక్సీకి రూ.7 వేలు, బస్సు, లారీలకు 12,500లు గ్రీన్ టాక్స్ కింద రవాణా శాఖ వసూలు చేస్తోంది.

రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు నుంచి 15 ఏళ్ల పాటు..

వాహనాలు రవాణాశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు నుంచి 15 ఏళ్ల పాటు వాహనం జీవితకాలం ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత వాహన ఇంజన్ సామర్థ్యం తగ్గిపోయి కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనల ప్రకారం పరిమితికి మించి కాలుష్యాన్ని వెదజల్లుతాయి. ఈ క్రమంలో ఆ వాహనాలను రవాణాశాఖ కార్యాలయంలో సామర్థ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పరిమితికి లోబడే కాలుష్య కారకాలను వెలువడుతున్నాయని వెల్లడైతేనే ఆ వాహనానికి గ్రీన్‌ట్యాక్స్ చెల్లిస్తే రోడ్డుపై తిరిగేలా రవాణా శాఖ అనుమతులు జారీ చేస్తోంది.

గ్రీన్‌ట్యాక్స్ కింద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఇలా….

గత ఎనిమిది సంవత్సరాల్లో గ్రీన్‌ట్యాక్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం వివరాలు ఇలా…. 2014-,15 (రూ.2,98,44,645 కోట్లు), 2015,-16 (రూ.3,99,41,907), 2016-,17 (రూ.4,22,06,971 కోట్లు) 2017-,18 (రూ.4,16,54,350 కోట్లు), 2018-, 19 (రూ.4,56,34,200 కోట్లు), 2019,20 (రూ.5,15,20,700 కోట్లు), 2020,21(రూ.3,77,49,250 కోట్లు), 2021,22 (రూ.5,78,18,600 కోట్లు) వసూలు అయ్యింది. ఈ సంవత్సరం గ్రీన్‌ట్యాక్స్ ద్వారా రూ.10 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News