Monday, December 23, 2024

ధాన్యం సేకరణలో కేంద్రం దగా?

- Advertisement -
- Advertisement -
ఖరీఫ్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపనున్న కేంద్రం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉత్పత్తి కానున్న ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వరి రైతుకు పెద్దషాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. దేశవ్యాప్తంగా వరిసాగు విస్తీర్ణం పెరగటమే ఇందుకు కారణంగా చూపుతోంది. దేశ ధాన్యాగారంగా పెరుపడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌సీజన్‌లో కూడా వరిసాగు విస్తీర్ణం గణనీయంగానే పుంజుకుంది. కృష్ణానది పరివాహకంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు ఎంతో శ్రమకోర్చి వరిసాగు చే శారు. అయితే వరి రైతుల్లో నెలకున్న ఈ ఉత్సాహం కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ధాన్యం పంటకోతల దాక కూడా నిలిచేటట్టు కనిపించటంలేదు. గత రెం డేళ్లుగా తెలంగాణ రాష్ట్రరైతాంగం పండించిన ధా న్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా చుక్కలు చూపుతూ వచ్చింది. బాయిల్డ్ రైస్,రా రైస్ కొనుగోలులో ఆంక్షలు విధిస్తూ అటు ధాన్యం పం డించిన రైతులను , ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ం ముప్పుతిప్పలు పెడుతూ వచ్చింది. ఈ సారి దేశవ్యాప్తంగా ఖరీఫ్‌లో వరిసాగు విస్తీర్ణం పెరగటం తో ఖరీఫ్ ధాన్యం సేకరణలో తెలగాణ రాష్ట్రం నుంచి సేకరించాల్సిన లక్ష్యాలకు భారీగా గండిపడే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ ఉన్నతాధి కారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఉత్తరభారతం నుంచే ధాన్యం సేకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇదే జరిగితే దక్షణ భారతదేశంలో అత్యధికంగా వరిపండించే రాష్ట్రంగా ఉన్న తెలంగాణపై ధాన్యం సేకరణ పెనుప్రభావం చూపే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఖరీఫ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా 411.521లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. గత ఖరీఫ్‌లో 400.721 లక్షల హెక్టార్ల వద్ద నే ఆగిపోయిన వరినాట్లు ఈసారి అదనంగా మరో 10.800లక్షల హెక్టార్లలో పడ్డాయి. వర్షాల రాక ఆలస్యం కారణంగా ఇంకా పలు రాష్ట్రాల్లో వరినాట్లు ఈ నెలాఖరు నాటికిగాని పూర్తి కావంటున్నారు. మరో పది లక్షల హెక్టార్లలో వరి విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలంగాణలో 25.990లక్షల హెక్టార్లలో వరినాట్లు
రా్రష్ట్రంలో కొంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు ధాన్యానికి మంచి ధర లభిస్తుందన్న ఆశతో పెద్ద ఎత్తున వరిసాగు పట్ల మొగ్గు చూపారు. ఖరీఫ్ సీజన్‌కింద ఇప్పటివరకూ 25. 990 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరినాట్లు పడ్డాయి. ఈ నెలాఖరు నాటికి మరో రెండు లక్షల హెక్టార్ల లో వరినాట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం వరిసాగు విస్తీర్ణంలో అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వరిసాగులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 59 లక్షల హెక్టార్లతో ప్రధమ స్థానంలో ఉండగా, పశ్చిమబెంగాల్ 40లక్షల హెక్లార్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. 38లక్షల హెక్లార్లతో చత్తిస్‌గఢ్ మూడవ స్థానంలో ఉంది. వీటి తర్వాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో బీహార్‌లో 35లక్షల హెక్టార్లు, ఒడిశాలో 34లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్‌లో 33లక్షల హెక్లార్లు, పంజాబ్‌లో 32లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. వీటి తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. దక్షిణ భారతంలో ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వరిసాగు జరిగింది. ఏపిలో 12 లక్షల హెక్టార్లు, కర్ణాటకలో 8లక్షల హెక్టార్లు, కేరళలో 0.610లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరినాట్లు పడ్డాయి.
అక్టోబర్‌లో ధాన్యం సేకరణ ప్రణాళిక
దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణ ప్రణాళికపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. భారత ఆహారసంస్థ ద్వారా ఎన్ని లక్షల టన్నల ధాన్యం సేకరణ జరపరాలి, అందులో రా్రష్ట్రాల వారీగా ఏ రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం సేకరించాలన్నదానికిపై అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేయనుంది. ప్రజల ఆహర భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎఫ్‌సిఐ గిడ్డంగుల్లో నిల్వ ఉన్న బియ్యం, రేషన్‌కార్డు దారులకు ఎంత బియ్యం అవసరం, దేశీయంగా బియ్యం ఎగుమతులకు ఉన్న అవకాశాలు, ప్రజలకు తిండి గింజలు తదితర అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళికను రూపొందించనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News