Tuesday, November 5, 2024

పంజాబ్‌లో హిందూ మత గ్రంథాల పరిశోధన కేంద్రం : సిఎం చన్నీ

- Advertisement -
- Advertisement -

Center for the Study of Hindu Texts in Punjab

చండీగఢ్ : హిందూ మత పవిత్ర గ్రంథాలైన రామాయణం, మహాభారతం, భాగవతాలపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జింత్ సింగ్ చన్నీ ప్రకటించారు. గురువారం పగ్వారా జిల్లాలో పరశురామ తపోస్తల్ కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవత్వ వికాసానికి ప్రేరణగా నిలిచిన ఈ గ్రంథాలపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చారిత్రాత్మక ప్రాంతంగా పరశురామ తపోస్తలాన్ని అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి రూ.10 కోట్లు చెక్కును అందజేశామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News