Thursday, January 23, 2025

కేంద్రం పిల్లి మొగ్గలు

- Advertisement -
- Advertisement -

Center has removed Telangana DISCs from the banned list

బకాయిలు లేవని రుజువు చేసిన రాష్ట్ర విద్యుత్
సంస్థలు తప్పు తెలుసుకున్న కేంద్రం అయినా..
కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం

మనతెలంగాణ/హైదరాబాద్: రెండు రోజులుగా తెలంగాణ విద్యుత్ సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తోన్న కేంద్రం తన తప్పును తెలుసుకొని విద్యుత్ ఎక్స్‌ఛేంజ్‌లో విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించి నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణ యం తీసుకుంది. అస లు ఎలాంటి బకాయిలు లేకుండా ఎం దుకు నిషేధం విధిస్తారని సిఎం కెసిఆర్ కేంద్ర విధానాలను ఎండగట్టడంతో పా టు కేంద్రం తీసుకు న్న తప్పుడు నిర్ణయాలపై కోర్టుకు వెళ్లాలని విద్యుత్ సంస్థల అధికారులకు సూ చించారు. ఈ నేపథ్యంలో సోమవారం దీనిపై కోర్టుకు వెళతామని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు తెలపడం తో దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. రాత్రికి రాత్రే ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించి బ్యాన్ ఎత్తివేసినట్టు తెలిపింది. రెండు రోజుల క్రితం 13 రా ష్ట్రాలు 29 డిస్కంల కు సంబంధించి భా రీ బకాయిలు ఉన్నాయంటూ కేంద్ర ప్ర భుత్వం నిషేధం వి ధించిన విషయం తె లిసిందే. అయితే అ యితే తెలంగాణకు సంబంధించి రూ. 1360 కోట్ల బకాయి లు ఉన్నాయంటూ మొదటిరోజు ప్రకటించిన కేంద్రం శుక్రవారం మధ్యాహ్నానానికి రూ.52.86 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నట్టు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో తాము చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికే చెల్లించామని ఆధారాలతో స హా ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రా వు వెల్లడించడంతో కేంద్రం తాము చేసిన తప్పును గుర్తించి శుక్రవారం రాత్రి నిషేధ జాబితా నుంచి తెలంగాణ డిస్కంలను తొలగించింది. అయితే శుక్రవారం మధ్యాహ్నానానికి ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మణిపూర్ రాష్ట్రాలపై నిషేధం తొలగించిన కేంద్రం, కావాలనే శుక్రవారం అర్ధరాత్రి వరకు తెలంగాణను నిషేధిత జాబితాలో కొనసాగించి మరోసారి రాష్ట్రంపై తన కక్ష సాధింపే చర్యను కొనసాగించింది. అయితే తాము చేసింది తప్పని తెలుసుకున్న కేంద్రం శుక్రవారం మధ్యాహ్నానికి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసలు తెలంగాణ డిస్కంలు కట్టేది రూ.52.85 కోట్లు మాత్రమేనని, అది కూడా ఎల్‌పిఎస్ (ఆలస్యపు జరిమానా మాత్రమేనని) తెలిపింది. దీనిపై వెంటనే స్పందించిన తెలంగాణ విద్యుత్ సంస్థలు తాము కట్టిన బకాయిలకు సంబంధించిన లెక్కలను ఆధారాలతో చూపడంతో కేంద్రం దిగి రాక తప్పలేదు.

ప్రస్తుతం రూ.1,037 కోట్ల బకాయిలు

అయితే కేంద్రం విధించిన నిషేధంతో కొన్ని రాష్ట్రాల డిస్కంలు భారీగా బకాయిలను చెల్లించడం గమనార్హం. గురువారం రూ.5,100 కోట్లుగా ఉన్న బకాయిలు శనివారానికి రూ.1,037 కోట్లకు చేరాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్ము అండ్ కాశ్మీర్, మిజోరాం, తమిళనాడుకు చెందిన డిస్కంలు రూ.1,037 కోట్లను చెల్లించాల్సి ఉందని కేంద్రం తెలిపింది. దీంతో డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఒక్కరోజులోనే 80 శాతం తగ్గిపోయాయని కేంద్రం పేర్కొంది. అయితే కొన్ని డిస్కంలు డబ్బులు చెల్లించగా, మరికొన్ని డిస్కంలు వివాద పరిష్కారం మార్గం ఎంచుకున్నట్టుగా తెలిసింది. నిషేధం విధించిన వెంటనే చత్తీస్‌గఢ్, బీహార్, మణిపుర్, ఝార్ఖండ్‌కు చెందిన డిస్కంలు వెంటనే డబ్బులు చెల్లించగా, రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు బకాయిలు తీర్చేశామని మహారాష్ట్ర పేర్కొంది. అసలు బకాయిలు లేని తెలంగాణకు మాత్రం శుక్రవారం అర్ధరాత్రి వరకు నిషేధంతో ఉంచడంపై విద్యుత్ రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన ధరలు

నిషేధం సమయంలో ఇండియన్ విద్యుత్ ఎక్స్‌ఛేంజీలో రియల్ టైమ్ మార్కెట్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. గురువారం రాత్రి యూనిట్ ధర రూ.7లుగా ఉండగా శుక్రవారం రూ.12కు చేరుకుంది. ఈ సెగ్మెంట్లో సగటు యూనిట్ ధర రూ.4.16 నుంచి రూ.5.46కు పెరిగింది.

ఏపికు అదే పరిస్థితి…

కేంద్రం విద్యుత్ కొనుగోళ్ల నిషేధంపై ఎపి ప్రభుత్వం సైతం విస్మయం వ్యక్తం చేసింది. పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు ఏపి ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేదని అక్కడి అధికారులు తెలిపారు. సమాచారం లోపం వల్లే విద్యుత్ కొనుగోళ్ల నిషేధిత జాబితాలో ఏపిని చేర్చారని, ఏపి డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.350 కోట్లు గతంలోనే చెల్లించాయని కేంద్రానికి ఎపి అధికారులు తెలియచేశారు. ఎపి ప్రభుత్వం నుంచి కేంద్రానికి సమాచారం వెళ్లడంతో ఆ జాబితా నుంచి ఏపి పేరు తొలగించడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News