- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ,గోదావరి నదీయాజమాన్య బోర్డుల నిర్వహణ వాటి పనితీరుపై కేంద్రం ఆరా తీసింది. మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. గోదావరి, కృష్ణానదుల పరివాహాకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రధాన ప్రాజెక్టులను బోర్డులకు అప్పగింత , ప్రాజెక్టుల నిర్వహణ తదితర అంశాలు ఈ సందర్బంగా కేంద్రజల్‌శక్తి శాఖ సమీక్షించింది. ప్రత్యేకించి కృష్ణానదీ పరివాహకంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీయాజమాన్య బోర్డుకు స్వాధీనం చేయటం వాటి నిర్వహణ ,తదితర అంశాలు ఈ సమావేవంలో చర్చకు వచ్చినట్టు సమాచారం.
- Advertisement -