Wednesday, November 13, 2024

కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని దంత వైద్యులకు కేంద్రం సూచనలు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : దంత వైద్యశాలలకు వచ్చే రోగులందరినీ కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందించే వారిగానే పరిగణించి ఆమేరకు వైద్యులు, సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ఈమేరకు గత ఏడాది మే 19 న జారీ చేసిన మార్గదర్శకాలను సవరించింది. కొత్తవాటిని బుధవారం విడుదల చేసింది.

1.కొవిడ్ కాలంలో దంతవైద్యులు, సంబంధిత సిబ్బందితో పాటు చికిత్స కోసం వచ్చేవారు కూడా ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తి చెందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగులకు కరోనా లక్షణాలు లేనప్పటికీ వారు వైరస్‌ను వ్యాపింప చేయవచ్చు. ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.

2. వ్యాక్సిన్ తీసుకున్నవారిని ఆర్‌టి పిసిఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారిని , కొవిడ్ సోకినప్పటికీ లక్షణాలు తగ్గిపోయి, 14 రోజులు గడిచిన వారిని తక్కువ ముప్పున్న రోగులుగా పరిగణించవచ్చు.

3. కొవిడ్ లక్షణాలున్న వారిని, పాజిటివ్ వచ్చిన వారిని ఎక్కువ ముప్పున్నవారుగా పరిగణించాలి. ఈమేరకు నిబంధనలు పాటిస్తూ కేవలం అత్యవసర వైద్యం మాత్రమే అందించాలి.

4. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరికరాలు లేకపోతే రోగులకు ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు పంపాలి. దంతవైద్యులు, సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలి.

5 సాధారణ ఉచిత సమస్యలున్నవారు 1800 1120 32 నంబరులో సంప్రదించాలి.

6. ముందస్తు అపాయింట్‌మెంట్ ద్వారా మాత్రమే రోగులను అనుమతించాలి. ఒక గదిలో ఒకరిని మాత్రమే పరీక్షించాలి. పరీక్షించినప్పుడు ప్రతి ఇద్దరి మధ్య కొంత సమయం ఇవ్వాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారికి ఉదయం వేళ ప్రత్యేక సమయం కేటాయించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News