Thursday, January 23, 2025

పిఎఫ్‌ఐపై వేటుకు కేంద్రం సంసిద్ధం

- Advertisement -
- Advertisement -

ED and NIA raids on offices of Popular Front of India

న్యూఢిల్లీ: ఈ నెల 22న 15 రాష్ట్రాలలో పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)కు చెందిన కార్యకర్లలు, నాయకుల ఇళ్లపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో యుఎపిఎ చట్టం కింద ఆ పార్టీని నిషేధించడానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ సిద్ధపడుతోంది. ఇప్పటికే 42 పార్టీలపై చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టంలోని సెక్షన్ 35 కింద వేటువేసిన హోం శాఖ తాజాగా ఇస్లామిక్ కార్యకలాపాల పేరిట ఉగ్రవాద శిక్షణ శిబిరాలును నిర్వహిస్తోందన్న ఆరోపణపై పిఎఫ్‌ఐను నిషేధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక యువకులను చేర్చుకుని అల్ ఖైదా, జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు పంపేందుకు ఉగ్రవాద శిక్షణను పిఎఫ్‌ఐ అందచేస్తున్నట్లు ఇప్పటికే ఎన్‌ఐఎ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తాము సేకరించిన ఆధారాలు, పిఎఫ్‌ఐ నాయకుల అరెస్టు దరిమిలా జరిగిన హింసాత్మక సంఘటనలను అధ్యయనం చేసి పిఎఫ్‌ఐ నిషేధానికి సిఫార్సు చేయాలని ఎన్‌ఐఎ యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News