Friday, November 22, 2024

అప్రమత్తంగా ఉండండి

- Advertisement -
- Advertisement -

Center letter to states in wake of new virus

స్క్రీనింగ్ మరింత కఠినంగా నిర్వహించండి
కంటైన్‌మెంట్, వ్యాక్సినేషన్ పెంచండి
కొత్త వైరస్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరింట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న వేళ కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాలనుంచి వచ్చే ప్రయాణికుల స్క్రీనింగ్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇంటెన్సివ్ కంటైన్‌మెంట్, చురుకైన నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలని ఆ లేఖలో రాష్ట్రాలకు సూచించారు. కొవిడ్19 పరీక్షలను పెంచాలని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు తగ్గినట్లు తెలిపారు. కొవిడ్ హాట్‌స్పాట్లను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.

పాజిటివిటీ రేటు 5 శాతంకంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని పేర్కొన్నారు. తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పనకు వినియోగించాలన్నారు. కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్‌కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం ల్యాబ్‌లను ఉపయోగించుకోవాలన్నారు. అలాగే తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారంతో ప్రెస్ బ్రీఫింగ్, కొవిడ్ బులెటిన్‌లను విడుదల చేయాలని సూచించారు. ఒమిక్రాన్ రకం వైరస్‌ను ప్రస్తుతం బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం,ఆస్ట్రియా, బోట్స్‌వానా, ఇజ్రాయెల్, హాంకాంగ్( చైనా) దేశాల్లో గుర్తించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News