Saturday, December 21, 2024

కేంద్రం ‘వస్త్ర’శస్త్రం

- Advertisement -
- Advertisement -

టెక్స్‌టైల్స్ పార్కులపై కేంద్రం కొత్త కుట్ర
49% వదులుకుంటేనే

‘పిఎం మిత్ర’ పథకం ద్వారా అనేక
కొత్త మార్గదర్శకాలు జారీ
అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల
ప్రాధాన్యత తగ్గించడమే పథకంలో
రాష్ట్ర ప్రభుత్వాలు చేరాలంటే
కేంద్రం విధించే ప్రతి షరతుకు
తలొగ్గాల్సిందే పార్కుల
నిర్వహణలోనూ కేంద్రం వైఖరితో
వివాదాలు తలెత్తే అవకాశం?
సొంత పారిశ్రామిక విధానాలతో
పెట్టుబడులను ఆకర్షిస్తున్న
తెలంగాణలాంటి రాష్ట్రాలు
కష్టపడి తీసుకొచ్చిన వస్త్ర
పరిశ్రమలకు నిబంధనల పేరిట
కేంద్రం మోకాలడ్డే ప్రమాదం
టిఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో వరంగల్
జిల్లాలో ఇప్పటికే కాకతీయ
మెగా పార్కు అభివృద్ధి

మన తెలంగాణ/హైదరాబాద్: టెక్స్‌టైల్స్ రంగంలో కేంద్రం మరో కుట్రకు తెరలేపింది. ఆ రంగంలో పూర్తిగా పాగావేసే యత్నానికి ఒడిగట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నూతంగా తీసుకొచ్చిన ‘పిఎం మి త్ర (మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ అండ్ అప్పెరల్ పార్క్) పథకం ద్వారా అనేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించడమే కాకుండా టెక్స్‌టైల్ పా ర్కుల్లో కేంద్రానికి 49శాతం వాటాను వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలకు అశనిపాతంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి నిధు లు కావాలంటే తప్పనిసరిగా వాటాను వదులుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనల కారణంగా తెలంగాణ వంటి రాష్ట్రాలు భారీ గా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం వస్త్రరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్దఎత్తున టెక్స్‌టైల్స్ పార్కులను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కెఎంటిపి)ను అభివృద్ధి చేసింది. దక్షిణ కొరి యా వస్త్ర దిగ్గజం యంగ్‌వన్, కేరళకు చెంది న కిటెక్స్, దేశంలో పేరెన్నికగన్న వస్త్ర కంపెనీ గణేశా ఇకోసిఫెర్ తదితర 16 కంపెనీలు ఇ క్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకొన్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కెఎంటిపికి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభు త్వం పిఎం మిత్ర పథకం రాకముందే అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కాని కేం ద్రం నుంచి ఇప్పటివరకు ఒక్క పైసా రాలే దు. ఫలితంగా రాష్ట్రాల చెమట చుక్కలతో నిర్మాణమవుతున్న పారిశ్రామిక సౌధాలపై కేంద్ర ప్రభుత్వ పడగ నీడ కమ్ముతున్నది. మేక్ ఇన్ ఇండియా, సమృద్ధ భారత్ అని ప దేపదే చెప్పుకుంటున్న కేంద్రం శ్రమ ను తనదిగా చెప్పుకొనేందుకు కుయుక్తులు ప న్నుతున్నది. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అని నినాదాలిస్తూనే రంగంలో సమా క్య స్ఫూర్తికి నీళ్లొదులుతున్నది.

గత సంప్రదాయానికి మంగళం

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వాడలను ఏర్పాటు కేంద్రం దానికి కొం త సహాయం చేయడం గతం నుంచి ఆనవాయితీగా వస్తోంది. తాజాగా మోడీ ప్రభుత్వం పిఎం మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఆ సంప్రదాయానికి మంగళం పాడింది. టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు, నిర్వహణలో రాష్ట్రాల ప్రాధాన్యాన్ని తగ్గిస్తోంది. టెక్స్‌టైల్ పార్కుల అభివృద్ధిలో 49 శాతం వాటా తమది ఉంటుందని, తాము రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే పార్కులను అభివృద్ధి చేయాలని కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది.

దేశంలో వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయటానికి గతేడాది అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం పిఎం మిత్ర పథకాన్ని ప్రారంభించగా, ఈ సంవత్సరం జనవరి నెలలో మార్గదర్శకాలు విడుదల చేసింది. మెరుగైన నిర్వహణ, వ్యాల్యూ చెయిన్ ఏర్పాటు చేయడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడం, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ పథకం లక్ష్యాలు. ఇందులో భాగంగా భారీ, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన మొత్తం వ్యాల్యూ చెయిన్‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్, టెక్స్‌టైల్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రింటింగ్ వంటి దశల్లో పరిశ్రమకు అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు.

కేంద్రం నిర్వాహకంతో అనేక తలనొప్పులు

మిత్ర పథకం కింద పరిపాలనా ఖర్చులు రూ.30 కోట్లు కలుపుకొని మొత్తం రూ. 4,445 కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ నిధులను ఐదేళ్లు (202720-28 )వరకు చేయాలని నిర్ణయించింది. అంతవరకు కేంద్రం ఆలోచన బాగానే ఉన్నప్పటికీ నిబంధనలు మాత్రం రాష్ట్రాలపై పెత్తనం కొనసాగించే విధంగా రూపొందించారు. పైగా ఈ పథకంలో రాష్ట్రాలు చేరాలంటే కేంద్ర విధించే ప్రతి షరతుకు అంగీకరించాల్సి ఉంటుంది. 49 శాతం వాటా తీసుకోవటం ద్వారా పార్కు నిర్వహణను కేంద్రం నియంత్రించే అవకాశం ఉంటుంది. నిజానికి తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలు ప్రపంచమంతా కాలికి బలపం కట్టుకొని తిరిగి నేరుగా పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తున్నాయి. సొంత పారిశ్రామిక విధానాలతో పోటాపోటీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రం అన్నింటికంటే ముందున్నది. మిత్ర పథకంలో ఏర్పాటు చేసే టైక్స్‌టైల్ పార్కులో పెట్టుబుడులు పెట్టించేందుకు రాష్ట్రాలే కంపెనీలను ఒప్పించాల్సి ఉంటుంది. నానా కష్టాలుపడి, రాయితీలు ఇచ్చి కంపెనీలను తీసుకొచ్చిన తర్వాత, ఆ కంపెనీలకు కేంద్రం మోకాలడ్డితే పరిస్థితి ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

టిఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కెఎంటిపి)ను అభివృద్ధి చేసింది. ముడి సరుకు లభ్యత, నైపుణ్యంగల కార్మికులు, దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్డు, రైలు మార్గాలు ఉండటం తదితర అంశాలు దీని అనుకూలతలు. పార్క్‌లో రోడ్లు, ప్రహారీ గోడల నిర్మాణం పూర్తయింది. రెండువేల ఎకరాల్లో ఇప్పటి వరకు 1,190 ఎకరాల భూమిని సేకరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.1150 కోట్లు కాగా, రూ.11,586 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశమున్నది. దేశంలో ఎక్కడా ఇంత భారీస్థాయిలో టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. దక్షిణ కొరియా వస్త్ర దిగ్గజం యంగ్‌వన్, కేరళకు చెందిన కిటెక్స్, దేశంలో పేరెన్నికగన్న వస్త్ర కంపెనీ గణేశా ఇకోసిఫెర్ తదితర 16 కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం చేసుకొన్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కెఎంటిపికి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. వాస్తవానికి పిఎం మిత్ర పథకం రాకముందు నుంచే కెఎంటిపిపనులు జరుగుతున్నాయి.

కేంద్రం మెలికతో ఒక్క పైసా రాలేదు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త మెలికతో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా రాలేదు. కొత్త మార్గదర్శకాల ప్రకారం టెక్స్‌టైల్ పార్కుల్లో కేంద్రానికి 49 శాతం వాటా ఇస్తేనే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు కనీసం వెయ్యి ఎకరాలు క్లియర్ టైటిల్ స్థలం ఉండాలన్న నిబంధనలను తీసుకొచ్చింది. స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి)ని ఏర్పాటు చేసి సదరు స్థలాన్ని దానికి బదలాయించాల్సి ఉంటుంది. దీంతో చట్టబద్ధమైన ఎస్‌పివిలో 51శాతం రాష్ట్ర ప్రభుత్వం, 49 శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంటుంది. ఇక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పి), రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌క్యూ)తదితర పద్ధతుల ద్వారా అర్హులను ఎంపికచేసి భూకేటాయింపు జరిపి అదే పద్ధతిలో రాయితీలు కల్పించాల్సి ఉంటుంది. రెండు దశల వడపోత ద్వారా పిఎం మిత్ర పార్కుల ఎంపిక జరుగుతుంది.

మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం పార్కు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనకు ఎస్‌పివి ఆమోదం తప్పనిసరి. ఇక రెండో దశలో మాస్టర్‌ప్లాన్ అమలు కోసం డెవలప్‌మెంట్ క్యాపిటల్ సపోర్ట్ (డిసిఎస్) కింద కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఎస్‌పివికి నిధులు సమకూర్చుతుంది. డిసిఎస్ కింద మొదటి దశలో గ్రీన్‌ఫీల్డ్ పార్కులకు రూ.300 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు రూ.100 కోట్లు మంజూరు చేస్తారు. రెండో దశలో గ్రీన్‌ఫీల్డ్ పార్కులకు రూ.200 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు రూ.100 కోట్లు ఇస్తారు. అయితే మొదటి దశలో పనులన్నీ అనుకున్న విధంగా పూర్తయితేనే రెండో దశలో నిధులిస్తారు. ఈ నిబంధలన్నీ చూస్తుంటే టెక్స్‌టైల్స్ రంగంలో కేంద్రం పూర్తిగా తన ఆధిపత్యాన్ని చెలాయించాలన్న ఉద్ధేశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News