Monday, December 23, 2024

గిరిజనుల కోసం కేంద్రం ఆలోచించడంలేదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అందరం కలిసి ఉంటే సిఎం కెసిఆర్ వద్దకు తీసుకు వెళ్లి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నిజాంపేటలో తెలంగాణ ఎరుకల ఆత్మగౌరవ భవనానికి మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణా రావు, ఎమ్మెల్సీ శంబీపుర్ రాజు, ఎరుకల సమాజం అధ్యక్షులు రాములు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో 2 కోట్లతో కొత్త భవనం నిర్మించుకోవడం సంతోషంగా ఉందని, కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ఈ భవనం నిదర్శనమన్నారు. రేపు సాయంత్రం మరో కోటి రూపాయలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని, మొత్తం రూ. 3.5 కోట్లతో మంచి భవనం, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కేంద్రంలోని బిజెపి మాటలు  చెప్పడం తప్ప పని చేయడంలేదని దుయ్యబట్టారు. గిరిజనుల కోసం ఆలోచించలేదన్నారు. దేశంలో రూ. 10.50 కోట్ల మంది గిరిజన జనాభా ఉంటే కేంద్రం బడ్జెట్ లో పెట్టింది కేవలం 0.02% శాతమేనని మండిపడ్డారు.

మనం రాష్ట్రంలో రూ. 13 413 కోట్లు బడ్జెట్ లో పెట్టుకున్నామని, అంటే ఇది 9.5%గా ఉందని తెలిపారు. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నామని,  వృత్తిని నమ్ముకుని ఉన్నవారికోసం ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.  నిజాంపేట్ మున్సిపాలిటీ లో గతంలో 2 బస్తీ దవాఖానాలు ఉండేవని, వాటికి అదనంగా మరో 8 సాంక్షన్ చేస్తున్నామని, వారంలో ఆర్డర్ ఇస్తామని, రెండు మూడు నెలలలో అందుబాటులోకి వస్తాయన్నారు. కొంపల్లి లో కూడా 2 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News