- Advertisement -
న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియోపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోండడంతో ఆ వీడియోలను తక్షణం తొలగించాలని ట్విటర్‌తో సహా ఇతర సామాజిక మాధ్యమ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున సామాజిక మాధ్యమ సంస్థలు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని కేంద్రం పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరో వైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ట్విటర్‌పై కేంద్రం చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మహిళలను ఊరేగించే సంఘటనపై మణిపూర్ లోని చురచంద్‌పుర్ జిల్లాలో వేలాది మంది ప్రజలు నల్లదుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. బాధిత మహిళలకు న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -