Monday, December 23, 2024

35 వస్తువుల ధరలు పెరగొచ్చు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే నెలలో ప్రవేశపెట్టన్ను బడ్జెట్‌లో కొన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీ పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మరో మూడు వారాల్లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్ (బడ్జెట్ 2023)ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్‌లో దీర్ఘకాలిక వృద్ధి, అదే సమయంలో ఆర్థికంగా పురోగతిని సాధించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక తెలిపింది. దాదాపు 35 వస్తువులపై ప్రభుత్వం కస్టమ్ డ్యూటీ పెంచేందుకు సిద్ధమవుతోంది. వాటిలో ప్రైవేటు జెట్‌లు, హెలికాప్టర్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ గూడ్స్, జువెలరీ, హై గ్లాస్ పేపర్ వంటివి ఉన్నాయని నివేదిక తెలిపింది. దిగుమతులను తగ్గించేందుకు కస్టమ్ డ్యూటీ పెంచి, స్థానిక తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలనుకుంటోంది.

కస్టమ్ డ్యూటీని పెంచేందుకు గానూ అనవసరమైన వస్తువుల జాబితాను గుర్తించాలని వివిధ మంత్రిత్వశాఖలకు గత నెలలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. దిగుమతి సుంకం పెంచడం ద్వారా దిగుమతులను నిరుత్సాహపర్చడం ద్వారా 202122లో 4.4 శాతానికి పెరిగిన కరెంట్ ఖాతా లోటును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. నివేదిక ప్రకారం, భారతదేశ కరెంట్ ఖాతా లోటు ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం, జూలై-సెప్టెంబర్ (క్యూ2)లో ఇది 36.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. పెంచుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, దిగుమతి సుంకాల పెంపును కొన్ని పూర్తయిన ఉత్పత్తులపై మాత్రమే అమలు చేస్తే, అది ఆదాయాన్ని పెంచడమే కాకుండా, మేక్ ఇన్ ఇండియా చొరవకు ఊతం ఇస్తుంది. ప్రభుత్వం 2014లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతేడాది బడ్జెట్‌లో ఆభరణాలు, ఇయర్‌ఫోన్‌లపై దిగుమతి సుంకాన్ని పెంచారు. అంతకు ముందు బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News