Monday, November 25, 2024

తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం నిరంతర సహకారం

- Advertisement -
- Advertisement -
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగింది
మోడీ సర్కార్ వివిధ శాఖల నుంచి రూ. 5 లక్షల కోట్లు అందజేసింది
రిపోర్టు టు పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ సర్కార్ నిరంతరం సహకరించిందని, గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర తెలియజేస్తూ రిపోర్టు టు పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గత తొమ్మిదేళ్లలోతెలంగాణకు కేంద్ర ఇచ్చిన నిధులపై ప్రజలకు నివేదిక అందించారు. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉద్దేశ్యమని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు. కేంద్రం చెప్పే లెక్కలు-రాష్ట్ర చెబుతున్న లెక్కలపై క్లారిటీ ఇచ్చారు. కేంద్రం నుంచి వివిధ శాఖలు రూ. 5 లక్షల కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్దపల్లి మినహా అన్ని జిల్లాలకు నేషనల్ హైవేల అనుసంధానం చేశారు . వీటి కోసం 1లక్ష 8వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేసింది. హైదరాబాద్ గేమ్ చెంజర్‌గా కానున్న రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించిన భూ సేకరణ తొందరగా పూర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు..

* 9 ఏళ్లలో రాష్ట్రంలో 37 వేల కోట్లకు పైగా రైల్వే లైన్లను డబ్లింగ్ ఏర్పాటు చేశాం.
* సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించాం.
* ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ రెండవ దశ చాలా రోజు ఆలస్యం అయ్యింది.
* కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది.
* ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందే భారత్ రైళ్లలో రెండు తెలంగాణలో నడుస్తున్నాయి. -ప్రజల అభిప్రాయ డిజైన్ మేరకు అనేక రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తున్నాం .
పౌర విమానయానం…..
* భూ సేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యం.
* 2014 తర్వాత తెలంగాణలో 11 సాగు నీటి ప్రాజెక్ట్ లకు ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News