Thursday, January 23, 2025

తెలంగాణను కేంద్రం శత్రు రాష్ట్రంగా చూస్తోంది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్వచ్చ సర్వేక్షన్ లో అత్యుత్తమ జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచిందని రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కెటిఆర్ తెలిపారు. వరుసగా మూడు సార్లు దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా నిలించిందని మంత్రి పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కృషివల్లే ఈ పురస్కారాలు వస్తున్నాయని కెటిఆర్ కొనియాడారు. గతంలో ఉత్తమ గ్రామలుగా గంగదేవిపల్లి, అంకాపూర్ మాత్రమే ఉండేవన్నారు. ఇప్పుడు అనేక గ్రామాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయని ఆయన వెల్లడించారు.

గ్రామాలకు రూ. కోటి లోపు బకాయిలున్నీ వెంటనే విడుదల చేస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. మొత్తం రూ.1300 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణను కేంద్రం శత్రు రాష్ట్రంగా చూస్తోందని మండిపడ్డారు. కేంద్రం రూ.1200 కోట్ట ఉపాధి హామీ నిధులు ఆపేసిందని మంత్రి ఆరోపించారు. తెలంగాణతో రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డులిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News