Saturday, November 23, 2024

కేంద్రానికి రాష్ట్ర ధనం కావాలి ధాన్యం అక్కర్లేదు

- Advertisement -
- Advertisement -

Center should reconsider its stance on yasangi grain

యాసంగి ధాన్యంపై కేంద్రం తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలి రాష్ట్రంలో సాగునీటి వసతులకు కేంద్రం ఎటువంటి సాయం అందించడం లేదు నేడు ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో కూర్చోబోతున్నాం కేంద్రం రెండు నాల్కల ధోరణిని ఎండగడతాం : సిరిసిల్లలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ తంగళ్ళపల్లి/కరీంనగర్ : సిరిసిల్ల మానేరు వాగులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన రాజీవ్‌నగర్ కు చెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పరామర్శించారు. తల్లితండ్రులను ఓదార్చి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దుర్ఘటన జరిగిన ప్రదేశ ములో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు సూచించాను. చెక్‌డామ్‌కు మరమ్మతులు, కట్టతెగిన ప్రాంతంలో ఏర్పడిన గొయ్యిని పూడ్చేలా చూడాలని మున్సిపల్ చైర్మన్‌కు ఆదేశాలిచ్చారు. నీరు ఏ్పఐకి ఒకే రకముగా కనిపిస్తుంది, కానీ క్రిందికి ఒకే రకముగా ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి, పిల్లలు గమనించాలన్నారు .

వానాకాలం పంట పూర్తిగా ప్రభుత్వమే కొంటది : మంత్రి కెటిఆర్

జిల్లాలో 52 వేల మెట్రిక్ టన్నులు కొన్నామని, ఇంకా 3 లక్షల టన్నుల పంట కొనవలసి వస్తుందన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులకు తెలియజేశాను. రాష్ట్రం 4,743 దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వర దాన్యం సేకరిస్తుoదని రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలన్నారు . రాష్ట్రములో వ్యవసాయానికి నీతి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదన్నారు . యాసంగి దాన్యం కొనమని అనేదాన్ని కేంద్రం పునసమీక్షించుకోవాలన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇందిరాపార్క్ వద్ద దార్నాకు కూర్చోబోతున్నామని తెలిపారు . కేంద్రానికి తెలంగాణ ధనం కావాలి కానీ, దాన్యం వద్దు అనే కేంద్ర విధానాన్ని వ్యతిరేఖిస్తున్నామన్నారు . కేంద్రం రెండు నాల్కల ధోరణిని ఎండగట్టబోతున్నామన్నారు .

స్థానిక బిజెపి అసాత్య ప్రచారాన్ని నమ్మి వరి వేస్తే రైతు నష్ట పోతాడన్నారు యాసంగి వరి ధాన్యం కొనే విషయం నిజమైతే, రాతపూర్వకముగా కేంద్రం పూర్తి పంట కొంటామని వ్రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు . లేనిపక్షములో బండి రెండు చెంపలు పగులకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలన్నారు ముఖ్యమంత్రి ఆలోచనలు నమ్మండి. పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు జడ్పీ చైర్పర్సన్ నేల కొండ అరుణ మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News