Sunday, December 22, 2024

లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్రం పీఛేముడ్

- Advertisement -
- Advertisement -

లేటరల్ ఎంట్రీ విధానంపై వెనక్కి భర్తీ
ప్రక్రియ ప్రకటనను రద్దు చేయాలని యుపిఎస్‌సికి లేఖ 
నిపుణుల పేరిట నియామకాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విపక్షాలు
రాజ్యాంగాన్ని కాపాడతాం : రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ : లేటరల్ ఎంట్రీ విధానంపై తీవ్ర విమర్శలు తలెత్తడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. దీని కోసం ఇచ్చిన ప్రకటనను రద్దు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపిఎస్‌సి) ఛైర్‌పర్శన్ ప్రీతి సుడాన్‌కి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. ప్రధాని మోడీ ఆదేశాల మేర కు ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో వివరించారు. సామాజిక న్యాయం పై మోడీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినందున ఈ అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో మంగళవారం ఈ ప్ర కటనను రద్దు చేసింది.

ఆగస్టు 17న యూపిఎస్‌సి 45 సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను ప్రభుత్వం లోని పలు శాఖల్లో నిపుణుల పేరిట (ప్రైవేట్ రంగానికి చెందిన వారితోపాటు ) లేటరల్ ఎం ట్రీ విధానం ద్వారా భర్తీ చేసేందుకు యుపిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసి న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైం ది. ఈ విధానం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను లాక్కుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఉన్నత స్థానాల్లో అణగారిన వర్గాలకు ఇప్పటికే ప్రాతినిధ్యం దక్కడం లేదని, దీన్ని మెరుగుపరిచే బదులు , లేటరల్ ఎంట్రీ ద్వారా వారిని ఆ పదవులకు దూరం చేస్తున్నారని ఇటీవల పేర్కొన్నారు. కాంగ్రెస్‌తోపాటు పలు విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యం లో కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

రాహుల్ స్పందన
దీనిపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పం దించారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ల వ్యవస్థను కాంగ్రెస్ పరిరక్షిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. “ రాజ్యాంగా న్ని , రిజర్వేషన్ వ్యవస్థను అన్ని విధాలా పరిరక్షి స్తాం.లేటరల్ ఎంట్రీ వంటి బీజేపీ ప్రయత్నాలను అ డ్డుకుంటాం. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం ద్వారా కులగణన ఆధారంగా సామాజిక న్యా యాన్ని అందిస్తాం” అని రాహుల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News