Friday, January 24, 2025

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి చేస్తూ.. గౌరవాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ తరుపున గోల్కొండ కోటలో జూన్ రెండో తేదీన జరిగే తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను గురువారం కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గత సంవత్సరం ఘనంగా నిర్వహించాం. ఈ సారి అదే విధంగా నిర్వహిస్తాం.- తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున గతేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించాం.. ఈసారి గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నాం. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు.. సాయుధ బలగాల పరేడ్ జరగనుంది.

-అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలలో శంకర్ మహదేవన్, డాక్టర్ ఆనంద శంకర్, బృందం, మంజులా రామస్వామి బృందం, మంగ్లీ, మధుప్రియ ఉద్యమాన్ని ప్రతిబింబించే పాటల కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. – సకల జనుల పోరాటంతోనే తెలంగాణ ఆవిర్భావం జరిగిందన్నారు. ఉద్యమంలో బిజెపి కీలక పాత్ర పోషించిందన్నారు. కృష్ణ నది నుంచి గోదావరి వరకు 26 రోజుల పాటు తెలంగాణ పొరుయాత్రను ఉద్యమ సమయంలో చేశానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ వేదికగా రెండు సార్లు నిరసన దీక్ష చేశానని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News