Sunday, January 19, 2025

రూ.100 కాయిన్ విడుదల చేయనున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: త్వరలో కేంద్రం రూ.100 కాయిన్‌ను విడుదల చేయనుంది. ఏప్రిల్ 30న ప్రధాని మోడీ మన్‌కీ బాత్ 100ఎపిసోడ్ సందర్భంగా విడుదల చేనుంది. అయితే ఈ కాయిన్ కేవలం ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనుందని సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారంప్రస్తుతం ఉన్న 1,2,5,10, 20నాణెల కంటే భిన్నంగా రూ.100కాయిన్ ఉండనుంది. 44ఎంఎం డయా మీటర్లో గుండ్రంగా ఉండనుంది. ఈ కాయిన్ తయారీకి 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్. జింక్ 5శాతం కలిగి ఉంటుంది. కాయిన్‌పై అశోక స్తంభం ముద్ర, సత్యమేవ జయతే, దేవనాగరి భాషలో భారత్ అనే పదాలు ఉండనున్నాయి. వెనుకభాగంలో మన్‌కీబాత్ 100ఎపిసోడ్ లోగో, 2023 అని రాసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News