Wednesday, November 6, 2024

అటార్నీ జనరల్ టర్మ్ ఏడాది పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Center will extend tenure of Attorney General for one more year

న్యూఢిల్లీ : అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ పదవీకాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించనుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తుంది. దీని మేరకు ఆయన అటార్నీ జనరల్‌గా జులై 1 నుంచి మరో ఏడాది విధులలో కొనసాగుతారు. కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయపరమైన వ్యాజ్యాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కెకె సీనియర్ న్యాయవాది. దేశానికి 15వ అటార్నీ జనరల్‌గా 2017 జులై 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జులై 1తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. కెకె కంటే ముందు ముకుల్ రొహత్గీ ఈ బాధ్యతలలో ఉన్నారు. రొహత్గీ 2014 నుంచి 2017 వరకూ కొనసాగారు. రాజ్యాంగ అత్యున్నత పదవులలో అటార్నీ జనరల్ పదవి కూడా ఒకటి.

91 సంవత్సరాల కెకె వేణుగోపాల్ మూడేళ్ల పదవీకాలం గత ఏడాది ముగిసిన దశలో ఆయన తన వయోభారం వల్ల బాధ్యతల నుంచి వైదొలుగుతానని తెలియచేసుకున్నారు. అయితే ఆయనను ఈ బాధ్యతల్లో మరికొంతకాలం ఉండాలని కేంద్రం కోరింది. దీనికి ఆయన అంగీకరించి, పదవిలో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు మరో ఏడాది ఆయనే దేశానికి ఎజిగా ఉంటారు. ఇక దేశ న్యాయబాధ్యతలలో మరో కీలకమైన పదవి సొలిసిటర్ జనరల్‌గా ఉంటూ వస్తున్న తుషార్ మెహతా పదవీకాలాన్ని గత ఏడాది కేంద్రం మూడేళ్ల పాటు పొడిగించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News