Wednesday, January 22, 2025

నీట్ యుజి రద్దు చేయం

- Advertisement -
- Advertisement -

మొత్తం పరీక్ష రద్దు సహేతుకం కాదు
భారీగా అవకతవకలు జరిగినట్లు ఆధారం లేదు
నీట్‌పై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

న్యూఢిల్లీ: నీట్ యుజిపై తన వైఖరిని కేంద్రం సుప్రీం కోర్టు వద్ద పునరుద్ఘాటించింది. పరీక్షను రద్దు చే సి, తిరిగి పరీక్ష నిర్వహించాలని భావించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. 24 లక్షల మంది విద్యార్థు లు హాజరైన పరీక్షలో పెద్ద ఎత్తున అవకతవకలు ఏవీ చోటు చేసుకోలేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టులో కేంద్రం ఒక అఫిడవిట్ సమర్పిస్తూ, 2024 పరీక్షను పూ ర్తిగా రద్దు చేయడం హాజరైన లక్షలాది మంది నిజాయతీపరులైన అభ్యర్థుల భవిష్యత్తును ‘తీవ్రంగా దెబ్బ తీస్తుంది’ అని తెలిపింది. పరీక్ష విశ్వసనీయతకు పెద్ద ఎత్తున భంగం కలిగిందని సూచించేందుకు ఆధారం ఏదీ లేనందున పరీక్షను రద్దు చేయడం

సహేతుకం కాబోదని కేంద్రం వాదించిం ది. ఆరోపణలపై కూలంకష దర్యాప్తునకు సిబిఐని ఆదేశించినట్లు పలువురిని అరెస్టు చేసినట్లు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తూ, నిష్పాక్షికంగా, పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు తాను నిబద్ధమై ఉన్న ట్లు తెలియజేసింది. ‘ఏ పరీక్షలోనైనా ప్రశ్న పత్రాల విశ్వసనీయత అత్యంత ప్రధానమ ని, కొన్ని నేరస్థ శక్తుల ప్రేరణతో నేరమనస్తత్వంతో విశ్వసనీయతకు భంగం వాటిల్లుతూ అలాంటి వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరించాలని, చట్ట ప్రకారం వారిని శిక్షించేలా చూడాలని కేంద్రం భావిస్తోంది’ అని అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News