Monday, December 23, 2024

విపత్తు సాయంలోనూ వివక్షే

- Advertisement -
- Advertisement -

బిజెపి పాలిత రాష్ట్రాలకు వేలాది కోట్లు

తెలంగాణకు ఐదేళ్లలో చిల్లిగవ్వ లేదు
ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధుల మంజూరులో కేంద్రం సవతి తల్లి ప్రేమ

మోడీజీ సమాఖ్య స్ఫూర్తి
ఇదేనా?

భారీ వరదలతో తెలంగాణ సతమతమవుతు న్నప్పటికీ 2018 నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ ద్వారా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 2020లో హైదరాబాద్‌లో భారీ వరదలు వచ్చినప్పుడు వరద సాయం కోసం ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు గోదావరి వరదల కూ కేంద్రం సాయం ఎందుకు సాయం చేయట్లేదు? మోడీజీ సబ్ కా సాథ్..
సబ్ కా వికాస్, సమాఖ్య స్ఫూర్తి ఇదేనా?

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం వర ద సహాయ నిధుల విడుదలలోనూ వివక్షత ప్రదర్శిస్తోంది. వివిధ రాష్ట్రాలకు ప్రతిఏటా వరద సహాయం కింద ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసిన నిధులను పరిశీలిస్తే కేంద్ర పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద కేంద్రం బిజెపి పాలిత రాష్ట్రాలకు వరుసగా ఐదేళ్లు నిధులు పెద్ద ఎత్తున విడుదల చేస్తూ రెండుసార్లు భా రీ వరదలకు గురైన తెలంగాణకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. అదే సమయంలో బిజెపిపాలిత మధ్యప్రదేశ్‌కు రూ. 4538 కోట్లు, గుజరాత్‌కు రూ. వెయ్యి కోట్లు, హర్యానాకు రూ.748 కో ట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.157 కోట్లు, కర్ణాటకకు రూ.6480 కోట్లు విడుదల చేసింది. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలు వెల్లువెత్తాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని అల్లలాడాయి. భద్రాచలం నీట మునిగిం ది. మూడు రాష్ట్రాలకు రాకపోక లు స్తంభించాయి.

ఇలాం టి విపత్కర స్థితిలో సిఎం కెసిఆర్ స్వయానా రంగంలోకి దిగారు. అప్పటికప్పుడు సిఎం కెసిఆర్ రూ.1000 కోట్లు ప్రకటించారు. ఆ వెయ్యి కోట్లతో భవిష్యత్తులో ముంపు గ్రామ ప్రజలకు ఇబ్బందులు కాకుం డా ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలోనూ హైదరాబాద్‌లో భారీ వర్షం ముంచెత్తిన సందర్భంలో పలు కాలనీలు నీటమునిగాయి. ఆ సమయంలోనూ కేంద్రం పైసా సా యం చేసేందుకు కూడా ముందుకు రాలేదు. ఆ సమయంలోనూ సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు బాసటగా నిలిచారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. మరి అలాంటి సమయంలోనూ కేంద్రం చోద్యం చూస్తుండటం గమనార్హం.

ఇక తాజాగా ప్రకటించిన ఎన్డీఆర్‌ఎఫ్ కింద విపత్తు సహాయనిధిని పరిశీలిస్తే.. తెలంగాణకు ఐదేళ్లలో వరుసగా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. అదే గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్నాటక, రాజస్థాన్ తదితర బిజెపి పాలిత రాష్ట్రాలకు వరుసగా విపత్తు నిధులిచ్చి తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ విడుదల చేయలేదనేది స్పష్టమవుతోంది. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని, తెలంగాణ పట్ల కేంద్రానికి ఉన్న వివక్షతకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని అనేవారు లేకపోలేదు. కేంద్రం నుంచి చిల్లిగవ్వ అయినా గత ఐదుసంవత్సరాల్లో విపత్తు సాయం అందిన దాఖలాలులేవని టిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ట్విట్టర్ ద్వారా కేంద్రపై విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం కనబరుస్తున్న వివక్షాపూరిత వైఖరి పలు విమర్శలకు తావిస్తోందని పలువురు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News