Saturday, November 16, 2024

కేంద్రం కీలక నిర్ణయం.. 62 కంటోన్మెంట్ బోర్డుల రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని మొత్తం 62 సైనిక కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వలస పాలన దశలోని వ్యవస్థకు ఆనవాలుగా ఉన్న ఈ కంటోన్మెంట్ బోర్డుల వ్యవస్థ ఇకపై ఉండబోదని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేసి వీటి పరిధిలోని పౌర ప్రాంతాలను సంబంధిత స్థానిక మున్సిపల్ సంస్థలకు అప్పగించడం జరుగుతంది. అయితే కంటోన్మెంట్ల పరిధిలోని సైనికుల బస ప్రాంతాలు ఇకపై మిలిటరీ కేంద్రాలుగా ఉంటాయి. దేశంలో ఇప్పుడు మొత్తం 62 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. వీటిలో దక్షిణాదిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చిరకాలంగా ఉంది. కంటోన్మెంట్ బోర్డుల ఎత్తివేత ప్రకియ ముందుగా హిమాచల్ ప్రదేశ్‌లోని యాల్ కంటోన్మెంట్ నుంచి ఆరంభం అవుతుంది. ఈ కంటోన్మెంట్ బోర్డును తీసివేసి మిలిటరీ స్టేషన్‌గా మారుస్తారు. తరువాతి క్రమంలో దశలవారిగా ఇతర కంటోన్మెంట్ బోర్డుల రద్దు జరుగుతుంది.

దేశంలో బ్రిటిష్ పాలన దశలో కంటోన్మెంట్ బోర్డులు వెలిశాయి. అప్పటి ఈ వలసవాదపు దశ వ్యవస్థను మార్చివేయాలనే ఆలోచనలో భాగంగానే ఈ బోర్డుల రద్దుకు దిగినట్లు తెలిపారు. దేశంలోని పలు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు పలు కారణాలతో తమను కంటోన్మెంట్ బోర్డు పరిధినుంచి తప్పించాలని కోరుతూ వస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డుల్లో తమ ప్రాంతాలుండటంతో భద్రతా సైనిక కార్యకలాపాలు శిక్షణలు నిబంధనల పరిధిలో తమ నివాసిత ప్రాంతాల్లో ప్రగతి కార్యకలాపాలు మందగించాయని స్థానికులు వాపోతూ వస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే తాము ఇక్కడ వెనుకబడి ఉన్నామని తెలియచేసుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితమే హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం , కేంద్రం మధ్య దీనిపై చర్చల క్రమంలో ముందుగా అక్కడి కంటోన్మెంట్ రద్దుకు ముందుగా నిర్ణయం జరిగింది. ఇప్పుడు ఈ వరసలో దేశంలోని మొత్తం కంటోన్మెంట్ల రద్దు జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News