Wednesday, January 22, 2025

కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులకు అబద్ధాలు చెబుతున్నాయి: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అవినీతిపై ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడాక సిబిఐ తనకే సమన్లు పంపగలదని తాను ముందే ఊహించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆదివారం హాజరుకమ్మని ఆయనకు సమన్లు అందాక ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు.

మీడియా వ్యక్తులతో మాట్లాడుతూ ఆయన ‘కేంద్ర దర్యాప్తు సంస్థలు లిక్కర్ పాలసీ దర్యాప్తు కేసులో మాకు వ్యతిరేకంగా అబద్ధాలు చెబుతున్నాయి. ఇప్పటికే అరెస్టు చేసిన వ్యక్తులను చిత్రహింసలు పెడుతున్నాయి. ఒత్తిడి తెస్తున్నాయి. మమ్మల్ని దెబ్బతీయడానికి వారిని ఒత్తిడి చేస్తున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

‘మనీశ్ సిసోడియాపై తప్పుడు ఆరోపణలు చేశారు. తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వమని కొందరిని కొట్టారు. సాక్ష్యాల కోసం సిబిఐ వారిని చిత్రహింసలు పెడుతోంది. అవినీతి నిర్మూలనకు అనుసరిస్తున్న గొప్ప విధానం ఇది’ అని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 16న హాజరుకమ్మని సిబిఐ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చింది. కాగా కేజ్రీవాల్ జవాబులు ఇచ్చేందుకు సిబిఐ ముందు హాజరవుతారని ఆప్ నాయకులు తెలిపారు. ఇకపోతే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సిబిఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. తర్వాత మార్చి 9న ఈడి అరెస్టు చేసింది. తీహార్ జైలులో కొన్ని గంటలపాటు ప్రశ్నించింది. ఆయనకు బెయిల్ కూడా ఇవ్వకుండా పదేపదే రిమాండును పొడగించుకుంటూ పోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News