- Advertisement -
న్యూఢిల్లీ : ఎస్‌బిఐ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెవైసి సబ్మిట్ చేయకపోతే అకౌంట్‌లను బ్లాక్ చేస్తామని వస్తున్న సందేశాలపై కేంద్రం అప్రమత్తమైంది. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఎస్‌బిఐ ఖాతాదారుల్ని లక్షంగా ఎంచుకున్నారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతేకాదు అనుమానాస్పద వ్యక్తులు కాల్ చేసినా,మెయిల్స్ పెట్టినా రిప్లయి ఇవ్వొద్దని తెలిపింది. ఒకవేళ ఎవరైనా పొరపాటున వచ్చిన మెసేజ్‌లకు సమాధానాలు ఇచ్చి ఉంటే report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలని తెలిపింది.
- Advertisement -