- Advertisement -
హైదరాబాద్ : కొవిడ్ 19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ 45 లక్షల డోస్‌లకు కేంద్రం భారత్ బయోటెక్‌కు అనుమతి మంజూరు చేసింది. ఈ 45 లక్షల డోస్‌ల్లో 8 లక్షల డోస్‌లు మిత్రదేశాలైన మారిషస్, ఫిలిప్పైన్స్, మయన్మార్ లకు ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇదివరకటి ఆర్డరు ప్రకారం 20 లక్షల డోస్‌లను రెండు రోజుల్లో ఆ కంపెనీ పంపనున్నట్టు వెల్లడించింది. 55 లక్షల డోస్‌లకు ప్రభుత్వ ఆర్డరు లభించగానే మొదటి బ్యాచ్ వాక్సిన్లను భారత్ బయోటెక్ గన్నవరం (విజయవాడ), గువాహతి, పాట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు పుణె, భువనేశ్వర్, జైపూర్, చెన్నై, లక్నోలకు పంపింది. ఇంతేకాక ఉచితంగా 16.5 లక్షల డోస్‌లను ప్రభుత్వానికి అందచేసింది.
- Advertisement -