Saturday, January 11, 2025

ఆర్‌బిఐ పిసిఎ నుంచి సిబిఐ ఎగ్జిట్!

- Advertisement -
- Advertisement -

Central Bank of India exit from RBI PCA

న్యూఢిల్లీ : ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిబిఐ)ను ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) తన పిసిడి(తక్షణ దిద్దుబాటు చర్య) ఆంక్షలను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఐదు త్రైమాసికాలుగా ఆర్థిక పరిస్థితి నిలకడగా మెరుగవడంపై బ్యాంక్ ఇప్పటికే ఆర్‌బిఐ వద్ద రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని ప్రమాణాలను చూసిన తర్వాత పిసిఎ పరిధి నుంచి తొలగించాలంటూ బ్యాంక్ చేసిన అభ్యర్థనను ఆర్‌బిఐ పరిశీలిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ త్రైమాసికంలో రూ.234 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గతేడాదిలో రూ.205 కోట్లతో పోలిస్తే 14.2 శాతం వృద్ధిని సాధించింది. బ్యాంక్ స్థూల ఎన్‌పిఎ (నిరర్థక ఆస్తులు) గతేడాదిలో 15.92 శాతంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో 14.9 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పి 5.09 శాతం నుంచి 3.93 శాతానికి తగ్గింది. ఆర్‌బిఐ పిసిఎ పరిధిలో ఉన్న మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుకో బ్యాంక్‌లు 2021 సెప్టెంబర్‌లో బయటికి వచ్చాయి.

పిసిఎస్ పరిధి కింద మిగిలి ఉన్న ఒకే ఒక్క బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా, ఇది కూడా ఇప్పుడు బయటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్‌పిఎలు పెరగడం, తక్కువ ఆస్తుల రిటర్న్ కారణంగా 2017లో ఆర్‌బిఐ ఈ బ్యాంకులను తన రాడార్‌లోకి తీసుకుని, పర్యవేక్షణ కొనసాగించింది. దీనికి గాను పిసిఎ వ్యవస్థను రూపొందించి, దాని పరిధిలోకి మంచిగా పనిచేయని బ్యాంకులను తీసుకుంది. ఆర్థిక ఆరోగ్యం మెరుగయ్యేంత వరకు పిసిఎ పరిధిలో ఉన్న బ్యాంకులపై ఆర్‌బిఐ నియంత్రణ, నిఘాను పెంచింది. పిసిఎ పరిధి లో ఉన్న బ్యాంకులు ఆర్‌బిఐ ఆంక్షలను ఎదుర్కొంటాయి. అంటే డివిడెంట్ పంపిణీ, బ్రాంచ్ ల విస్తరణ, నిర్వహణ పరిహారం, మూలధనం వంటి వాటిపై ఆంక్షలు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News