Monday, December 23, 2024

జర్మన్ విదేశాంగ శాఖపై కేంద్రం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై వ్యాఖ్యలు చేసిన జర్మన్ విదేశాంగ మంత్రిత్వశాఖపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. ఇక్కడి జర్మన్ రాయబారి జార్జ్ ఎన్జ్‌వీలర్‌ను పిలిపించి తన నిరసన తెలిపింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు శనివారం జర్మన్ రాయబారిని పిలిపించి కేజ్రీవాల్ అరెస్టుపై జర్మన్ విదేశాంగ మంత్రిత్వశాఖ చేసిన వ్యాఖ్యలను భారతదేశ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడంపై అభివర్ణించారు. ఒక పక్షానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అవాంఛనీయమని తెలియచేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టును తాము గమనంలోకి తీసుకున్నట్లు జర్మన్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రతా ప్రమాణాలు, మౌలిక ప్రజాస్వామిక సూత్రాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని భావిస్తున్నట్లు, ఆశిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. న్యూ ఢిల్లీలోని జర్మన్ డిప్యుటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను శనివారం రప్పించి జర్మన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యలపై తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేసినట్లు విదేశఋ వ్వయహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ తెలిపారు. ఇటువంట వ్యాఖ్యలు మన న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడంపై పరిగణిస్తామని ఆయన చెప్పారు. మన న్యాయ వ్యవస్థను కించపరచడమేనని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News