Monday, January 20, 2025

దేశంలో సరికొత్తగా సమీకృత పెన్షన్ స్కీమ్..

- Advertisement -
- Advertisement -

ఉద్యోగులకు సామాజిక రక్షాబంధన్
23 లక్షల మంది వేతనజీవులకు లబ్ధి
రిటైర్ తరువాత నిర్ణీత, రూ 10వేల కనీస పింఛన్
ఫ్యామిలీ పెన్షన్ వేతనంలో 60 శాతం ఖరారు
ప్రతిపాదిత ఎన్‌పిఎస్‌ను పక్కకు పెట్టిన సర్కారు
ప్రతిపక్షాల వ్యతిరేకతతో కొత్తగా యుపిఎస్‌కు శ్రీకారం
రూ 10,579 కోట్లతో విజ్ఞాన ధారా స్కీం అమలు
ఇంటర్, సాంకేతిక విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
ఉక్రెయిన్ నుంచి రాగానే మోడీ సారధ్యంలో కేబినెట్ భేటీ
న్యూఢిల్లీ : దేశంలో సమీకృత పెన్షన్ స్కీమ్(యుపిఎస్)కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం ఇక్కడ జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం ఆమోదం పొందింది. ఈ కీలక నిర్ణయంతో దేశంలోని 23 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. ఇది ఉద్యోగ వర్గాల సామాజిక భద్రతకు ఉద్ధేశించిన పథకం అని వివరించారు. ఈ పథకం అమలుకు రూ 10,579 కోట్ల వ్యయం అవుతుందని లెక్క కట్టారు. ఉద్యోగులకు సర్వీసు తరువాత న్యాయబద్ధమైన కనీస పింఛన్ అందేలా చేయడమే ఈ పథకం ఆలోచన అని మంత్రి తెలిపారు.

రిటైర్ అయిన ఉద్యోగులకు నిర్థారిత ప్రకటిత పెన్షన్, కుటుంబ పెన్షన్ మొత్తం మీద విరమణానంతరం వారికి కనీస నిర్ణీత పింఛన్ దక్కడమే ప్రభుత్వ లక్షం అని కూడా మంత్రి వివరించారు. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాదిలోనే జరిగే ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ నూతన పింఛన్ స్కీంపై (ఎన్‌పిఎస్)పై పలు బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వెలువడింది. దీనితో ఇప్పుడు కేంద్రం ఉద్యోగ, స్వీయ పక్ష ఆలోచనతో ఈ యుపిఎస్‌కు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి ఈ యుపిఎస్ ద్వారా మేలు జరుగుతుందని వైష్ణవ్, దీనిని ఉద్యోగులకు శుభవార్తగా తెలిపారు. ఈ స్కీమ్ 2025 ఎప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

ఉద్యోగులు ఎన్‌పిఎస్‌ను ఎంచుకుంటారా? లేక యుపిఎస్ పరిధిలోకి వస్తారా? అనేది వారి ఇష్టానికి వదిలిపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధాని మోడీ ఉక్రెయిన్, అంతకు ముందు పోలండ్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఈ కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సమావేశానికి ముందు మంత్రులు ప్రధానిని పర్యటన నేపథ్యంలో అభినందించారు. ఇప్పుడు ప్రకటిత కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారం ఉద్యోగులకు దక్కే ప్రయోజనాల వివరాలు
అస్యూర్డ్ పెన్షన్ దీని పరిధిలో ఉద్యోగి రిటైర్‌కు 12 నెలల ముందు ఉన్న సగటు మౌలిక వేతనంలో లెక్కకట్టి ఇందులో సగభాగం అంటే 50 శాతం వరకూ ప్రభుత్వోద్యోగులకు పింఛన్‌గా అందుతుంది. ఇది పాతిక సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి వర్తిస్తుంది.
ఫ్యామిలీ పెన్షన్ ః ఇక వేళ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి మరణం సమయంలో అందే పెన్షన్‌లో 60 శాతం వరకూ కుటుంబ సభ్యులకు అందుతుంది.

కనీస పెన్షన్: ఈ స్కీమ్ పరిధిలో రిటైర్‌మెంట్ తరువాత ప్రభుత్వోద్యోగలకు వారి పది సంవత్సరాల ఉద్యోగ సర్వీసు తరువా నెలకు రూ 10000 వరకూ కనీస పింఛన్ అందిస్తారు. ఇప్పుడున్న పెన్షన్ స్కీమ్ ప్రకారం యాజమాన్యం పది శాతం చెల్లించగా, కేంద్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. ఇప్పుడిది ఈ యుపిఎస్ పరిధిలో 18 శాతానికి చేరుతుంది. గత ఏడాది ఫైనాన్స్ సెక్రెటరీ టివి సోమనాథన్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వోద్యోగుల ఉద్యోగ అనంతర పింఛన్ విధానంలో మార్పులు , సవరణల సమీక్షకు దీనిని నియమించారు.

మార్పులు చేర్పులను ప్రభుత్వం సూచించింది. ఈ దశలో ఇంతకు ముందటి ఎన్‌పిఎస్‌లోని సంవిధానాలపై కూలంకుష పరిశీలన చేపట్టారు. నూతన పెన్షన్ విధానం సరిగ్గా లేదని, పలు లొసుగులు ఉన్నాయని, బిజెపియేతర రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. మార్పుల బదులు పాత పెన్షన్ విధానాన్ని (ఒపిఎస్) పునరుద్ధరించాల్సి ఉందని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పలు ఉద్యోగ సంఘాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సమీకృత పింఛన్ విధానం ఉద్యోగుల ముందుకు కేంద్రం తీసుకువచ్చింది. ఇంతకు ముందటి ఓల్డ్ పిన్షన్ విధానం పరిధిలో రిటైర్ తరువాత ఉద్యోగులకు వారి ఆఖరి వేతనంలో సగ భాగం వారి పెన్షన్ ఖాతాల్లో వచ్చి చేరేది. డిఎ స్థాయిలను బట్టి ఈ పెన్షన్ల స్థాయి పెరుగుతూ ఉండేది.

విజ్ఞాన ధారా స్కీంకు కేంద్రం ఆమోదం: మూడు పథకాలు ఇప్పుడీ పరిధిలోనికి
కేంద్ర మంత్రి మండలి శనివారం నాటి భేటీలో విద్యార్థులకు ఉపయుక్తం అయిన కీలక విజ్ఞానధార పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న మూడు వేర్వేరు ఏకీకృత స్కీంలు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం పరిధిలో ఉన్నాయి. వీటిని కొనసాగింపు క్రమంలోనే వీటిని విలీనం చేసి ఒకే వేదిక పైగా తీసుకువచ్చి దీనికి విజ్ఞాన ధార అనే సమీకృత కేంద్ర రంగ పథకం (యుసిఎస్‌సి)గా ముందుకు తీసుకువచ్చారు, ఈ విజ్ఞాన ధార స్కీం కోసం కేంద్రం రూ 10, 579 కోట్ల మూలధనం కేటాయించింది.

ఇది 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి అయిన 202122 నుంచి 2025 26 వరకూ వర్తిస్తుందని మీడియాకు కేంద్ర మంత్రి ఈ పథకం వివరాల క్రమంలో తెలిపారు. ఈ స్కీంలో అంతర్భాగంగా మూడు విస్తృత అంశాలు అంటే సైన్స్, టెక్నాలజీ సంస్థలు, మావన సామర్థ నిర్మాణం, సృజనాత్మకత, పరిశోథనా, అభివృద్ధి , సాంకేతిక ప్రగతి, పంపిణీలకు తగు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ విజ్ఞానధారను తీసుకు వచ్చినట్లు, దీనితో జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులకు, యువతరానికి మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు.

11, 12 తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
కేంద్ర కేబినెట్ తీసుకున్న యువ శక్తి కేంద్రీకృత కీలక నిర్ణయాలలో బయో ఇ 3 విధానం ఒక్కటి. విజ్ఞాన్‌ధార పథకం , దీనితో పాటు 11 , 12వ తరగతి విద్యార్థులకు, సాంకేతిక విద్యార్థులు అంటే ఐటిఐ ఇతర కోర్సుల వారికి ఇది వర్తిస్తుంది. వీరి విద్యారంగ ప్రోత్సాహకంగా ఇంటర్న్‌షిప్ కల్పనకు కూడా ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. పారిశ్రామిక , ఐటి విప్లవాల తరహాలో బయోసైన్స్ రంగాలలో కూడా భారీ ఉపాధి అవకాశాలు ఉన్నాయని దీనికి బయో ఇ 3 స్కీం తీసుకువచ్చినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News