Saturday, December 21, 2024

కేంద్ర క్యాబినెట్ ‘పరివార్ మండల్’

- Advertisement -
- Advertisement -

బిజెపివి ఆనువంశిక రాజకీయాలు
రాహుల్ గాంధీ విమర్శ

న్యూఢిల్లీ : ఆనువంశిక రాజకీయాలపై మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం తూర్పారబట్టారు. ఎన్‌డిఎ మంత్రివర్గాన్ని ‘పరివార్ మండల్’ అని ఆయన అభివర్ణించారు. మోడీ 3.0 ప్రభుత్వంలో పలువురు మంత్రులు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారేనని రాహుల్ పేర్కొన్నారు. ‘తరాల పోరాట సంప్రదాయాన్ని, సేవను, త్యాగాన్ని ఆశ్రితపక్షపాతంగా పేర్కొనేవారు తమ ‘సర్కారీ పరివార్’కు అధికార విల్లును పంచిపెడుతున్నారు’ అని రాహుల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. ‘మాటలు, చేతలకు మధ్య ఈ తేడా పేరు నరేంద్ర మోడీ’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఎన్‌డిఎ ‘పరివార్ మండల్’లో భాగంగా మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కుమారుడు హెచ్‌డి కుమారస్వామి, మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా కుమారుడు జోతిరాదిత్య సింధియా, అరుణాచల్ ప్రదేశ్ తొలి ప్రో టెమ్ స్పీకర్ రించిన్ ఖరు కుమారుడు కిరణ్ రిజిజు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే కుమార్తె రక్షా ఖడ్సే, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ మనుమడు జయంత్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్, మాజీ ఎంపి, మధ్య ప్రదేశ్ మంత్రి జయశ్రీ బెనర్జీ అల్లుడు జెపి నడ్డా పేర్లను రాహుల్ తన పోస్ట్‌లో ప్రస్తావించారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుమారుడు రామ్ నాథ్ ఠాకూర్, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు రామ్ మోహన్ నాయుడు, మాజీ ఎంని జితేంద్ర ప్రసాద కుమారుడు జితిన్ ప్రసాద, హర్యానా మాజీ ముఖ్యమంత్రి రావు బీరేంద్ర సింగ్ కుమారుడు రావు ఇంద్రజీత్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి వేద్ ప్రకాశ్ గోయల్ కుమారుడు పీయూష్ గోయల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియంత్ సింగ్ మనుమడు రవ్‌నీత్ సింగ్ బిట్టు, అప్నా దళ్ వ్యవస్థాపకుడు సోనేలాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్, ఉత్తర ప్రదేశ మాజీ మంత్రి మహారాజ్ ఆనంద్ సింగ్ కుమారుడు కీర్తి వర్ధమాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News